Tirupati Police Viral Video: తాగిన మైకంలో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసిన ఆకతాయిలకు నడిరోడ్డులోనే థర్డ్ డిగ్రీ ఇచ్చారు పోలీసులు. మామూలుగా అయితే పోలీస్ స్టేషన్లో విరగకుమ్ముతారు. కానీ పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లే ఓపిక లేనట్టుంది.. అందుకే అందరూ చూస్తుండగానే.. చేతిలో ఉన్న కర్రలతో బడిత పూజ చేశారు. వీరకొట్టుడు కొట్టారు. నడిరోడ్డు మీద ఆర్తనాదాలు పెడుతుంటే ఏమాత్రం కనికరించకుండా తుక్కు రేక్కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో మందుబాబుల ఆగడాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా లీలామహల్ జంక్షన్ సమీపంలో ఓ బార్ వద్ద ఆరుగురు యువకులు పీకల దాకా మద్యం తాగారు. తాగిన మత్తులో తల్లి కూతుర్లను వేధించారు. అడ్డగోలుగా మాట్లాడారు. ద్వంద్వార్థాలతో నరకం చూపించారు. వాస్తవానికి షాపింగ్ పని మీద బయటకు వచ్చిన ఆ తల్లి కూతుళ్ళు .. ఆ పని ముగించుకుని వెళ్తున్నారు. వారు వెళుతుండగా కొంతమంది ఆకతాయిలు మద్యం తాగి అడ్డగోలుగా మాట్లాడారు. ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. చివరికి వారి పాపం పండింది. అక్కడున్న స్థానికులు ఆ ఆరుగురిలో ముగ్గురిని పట్టుకున్నారు. దేహ శుద్ధి చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయానికి అక్కడికి పోలీసులు వచ్చారు.
ఆ ఆకతాయిలు చేసిన దారుణం గురించి పోలీసులకు చెబితే.. వారు మరిచిపోయారు. చేతిలో ఉన్న కర్రలతో తుప్పు వదిలించారు. నడిరోడ్డు మీద థర్డ్ డిగ్రీ చూపించారు. ఆరుగురిలో మరో ముగ్గురు పరారయ్యారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో మందు బాబుల ఆగడాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆడవాళ్లు రోడ్డు మీదకి వస్తే చాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బూతులతో రెచ్చిపోతున్నారు. పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. చివరికి స్థానికులు పట్టుకోవడంతో ముగ్గురు ఆకతాయులకు పోలీస్ స్టైల్ లో బుద్ధి చెప్పారు. ఇటీవల కాలంలో తమకు వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని.. ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
Accused youngsters received well deserved treatment from Tirupati Police for misbehaving with a mother, her daughter and attacking others with bottles. pic.twitter.com/jrFvTbgBTG
— Sowmith Yakkati (@YakkatiSowmith) September 19, 2025