Dussehra holidays 2025: ఏపీలో( Andhra Pradesh) దసరా సెలవుల పై కీలక అప్డేట్. సెలవుల పొడిగింపు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు రోజులపాటు దసరా సెలవులను పొడిగించింది. దసరా సెలవుల పై ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నారు మంత్రి లోకేష్. వాస్తవానికి అకడమిక్ క్యాలెండర్ను అనుసరించి చూస్తే.. ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజులపాటు దసరా సెలవులు ఇచ్చారు. కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో పాటు టిడిపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు మరో రెండు రోజులపాటు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 12 రోజులపాటు సెలవులు ఇచ్చినట్లు అయింది. తొలుత తొమ్మిది రోజులు పాటు సెలవులు ఇచ్చారు. దానికి రెండు రోజులు పొడిగించారు. పైగా ఈనెల 21 ఆదివారం కావడంతో కలిసి వచ్చింది. మొత్తం 12 రోజులపాటు సెలవు ఇచ్చినట్లు అయింది.
తెలంగాణలో ముందుగానే..
తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) దసరా ప్రధాన పండుగ. తెలంగాణలో బతుకమ్మ పండుగ సైతం జరుపుకుంటారు. అందుకే అక్కడ పాఠశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించారు. ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇచ్చారు. అంటే మొత్తం 13 రోజుల సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 4న అక్కడ పాఠశాలలు తెరుచుకొనున్నాయి. తెలంగాణలో ముందస్తుగా సెలవులు ఇవ్వడంతో ఏపీలో కూడా ఇవ్వాలన్న విజ్ఞప్తులు వెళ్లాయి. ఈనెల 22 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానుండడంతో ఆ రోజు నుంచి సెలవులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అయింది. కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీ గోపి మూర్తి ఇదే విషయంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక విజ్ఞప్తులతో..
అయితే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు.. టిడిపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మంత్రి నారా లోకేష్ ను( Minister Nara Lokesh) కోరారు. సెలవులను పొడిగిస్తూ సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల అభ్యర్థనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి లోకేష్ సెలవులపై ప్రకటన చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈనెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని.. అదే విషయం టిడిపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అంటే ఈ నెల 21 నుంచి దసరా సెలవులు మొదలు అవుతాయి అన్నమాట. దసరా సెలవులకు సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే వారు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు రోజుల పాటు సెలవులు పొడిగించడం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం. pic.twitter.com/SpUJldmwiH
— Lokesh Nara (@naralokesh) September 19, 2025