Homeవింతలు-విశేషాలుGoebbels Villa: గోబెల్స్ చచ్చిన బంగ్లా.. ఫ్రీగా ఇస్తామన్నా ఎవరూ రావడం లేదు.. ఏంటా దెయ్యాల...

Goebbels Villa: గోబెల్స్ చచ్చిన బంగ్లా.. ఫ్రీగా ఇస్తామన్నా ఎవరూ రావడం లేదు.. ఏంటా దెయ్యాల విల్లా కథ?

జర్మనీ దేశాన్ని హిట్లర్ పరిపాలిస్తున్న కాలంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా జోసెఫ్ గోబెల్స్ పేరుపొందారు. అప్పట్లో హిట్లర్ స్థాపించిన నాజీ పార్టీకి గోబెల్స్ ప్రధాన ప్రచారకర్తగా ఉండేవాడు.

Goebbels Villa: గజం స్థలం కోసమే ప్రాణాలు తీసుకుంటున్న రోజులివి. అలాంటిది 42 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ విల్లాను.. అది కూడా ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెబుతుంటే.. తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.. దీంతో ఆ భవనం కాస్త పాడుబడ్డ కొంపలాగా మారిపోయింది. అక్కడ దయ్యాలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు.. ఇంతకీ ఎక్కడ ఉంది ఆ విల్లా? ఏమిటి ఆ దయ్యాల కథ? ఈ కథనంలో తెలుసుకుందాం..

జర్మనీ దేశాన్ని హిట్లర్ పరిపాలిస్తున్న కాలంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా జోసెఫ్ గోబెల్స్ పేరుపొందారు. అప్పట్లో హిట్లర్ స్థాపించిన నాజీ పార్టీకి గోబెల్స్ ప్రధాన ప్రచారకర్తగా ఉండేవాడు. ఆ రోజుల్లో వార్తాపత్రికలు, రేడియోలు, సినిమాల వంటి ప్రసార సాధనాలలో నాజీ పార్టీ గురించి విపరీతమైన ప్రచారం చేసేవాడు.. దాని భావజాలానికి యువకులు ఆకర్షితులయ్యేలా రకరకాల రూపాలలో ప్రచారం కొనసాగించేవాడు. ఈ క్రమంలో గోబెల్స్ తన ప్రైవేటు వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు జర్మనీ రాజధాని బెర్లిన్ కు 25 కిలోమీటర్ల దూరంలో 42 ఎకరాల విస్తీర్ణంలో ఒక విల్లాను నిర్మించుకున్నాడు.

ఈ విల్లా నుంచే గోబెల్స్ నాజీ పార్టీకి సంబంధించి ప్రచార వ్యవహారాలు కొనసాగించేవాడు. అక్కడ పలువురు సినీ తారలతో ప్రైవేట్ గా గడిపే వాడని ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే ఈ భవనం ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ భవనానికి దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉండడంతో.. దానిని కాపాడటం ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది.. పైగా ఈ భవనానికి నాజీ పార్టీతో సంబంధం ఉన్న నేపథ్యంలో.. దీనిని వదిలించుకోవాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది.” ఈ విల్లాను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఒక రకంగా బహుమతి అనుకోవచ్చు.. దానిని సొంతం చేసుకోవాలనుకుంటే ఎవరైనా ముందుకు రావచ్చని” జర్మనీ ఆర్థిక శాఖ మంత్రి స్టెపాన్ అవర్స్ ప్రకటించారు.

ఈ భవనంలో 2000 సంవత్సరం కంటే ముందు కొంతమంది నివసించేవారు. ఆ తర్వాత వారు ఈ భవనాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఖాళీ చేశారనేది ఇంతవరకూ తెలియ రాలేదు. ఈ భవనంలో దయ్యాలు ఉండటం వల్లే వారు ఖాళీ చేసి వెళ్లిపోయారనే వాదనలున్నాయి. నాజీ పార్టీ కోసం గోబెల్స్ ఈ భవనంలో చాలామందిని చంపాడట. వారి ఆత్మలు దయ్యాలుగా తిరుగుతున్నాయట. అందువల్లే అది దయ్యాల విల్లాగా మారిపోయిందట. అందువల్లే ఈ విల్లాను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ప్రస్తుతం ఈ భవనం రోజురోజుకు దెబ్బతింటున్నది. అందువల్లే కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో ప్రభుత్వమే ఉచితంగా ఇస్తామని ప్రకటన చేసిందట. ఒకవేళ దీనిని సొంతం చేసుకునేందుకు ఎవరూ ముందుకురాని పక్షంలో.. ఆ భవనాన్ని ధ్వంసం చేస్తామని జర్మనీ అధికారులు చెబుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు గోబెల్స్ ఈ భవనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తను మాత్రమే కాదు భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper