Homeవింతలు-విశేషాలుPune Businessman Case: భర్తలను ఎలా ఖతం చేయాలి.. దీనిపై పుస్తకాలు రాస్తున్నారు.. మహిళలు చదువుతున్నారు.....

Pune Businessman Case: భర్తలను ఎలా ఖతం చేయాలి.. దీనిపై పుస్తకాలు రాస్తున్నారు.. మహిళలు చదువుతున్నారు.. ఏం సొసైటీ రా బై

Pune Businessman Case: మగాళ్ళ బతుకు ఎంత దారుణంగా మారిపోయింది అంటే.. కట్టుకున్న భార్య చేతిలో సేఫ్టీ లేదు. కట్టుకోబోయే భార్య దగ్గర భద్రత లేదు. ప్రేమికురాలిని నమ్మే పరిస్థితి లేదు. ఎక్కడ స్పాట్ పెట్టారో తెలియదు. ఎవరితో డీల్ కుదుర్చుకున్నారో తెలియదు. ఎలా వేసేస్తారో కూడా తెలియదు.. ఒకటా రెండా.. ఎన్నో సంఘటనలు.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. జైలు శిక్షలు పడుతున్నాయి. మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ పరిస్థితి మారడం […]

Pune Businessman Case: మగాళ్ళ బతుకు ఎంత దారుణంగా మారిపోయింది అంటే.. కట్టుకున్న భార్య చేతిలో సేఫ్టీ లేదు. కట్టుకోబోయే భార్య దగ్గర భద్రత లేదు. ప్రేమికురాలిని నమ్మే పరిస్థితి లేదు. ఎక్కడ స్పాట్ పెట్టారో తెలియదు. ఎవరితో డీల్ కుదుర్చుకున్నారో తెలియదు. ఎలా వేసేస్తారో కూడా తెలియదు.. ఒకటా రెండా.. ఎన్నో సంఘటనలు.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. జైలు శిక్షలు పడుతున్నాయి. మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ పరిస్థితి మారడం లేదు. మారే అవకాశం కనిపించడం లేదు.

ఇటీవల పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడిని కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి అంతం చేసింది. అత్యంత ఎత్తైన కోట నుంచి కిందికి తోసి చంపేసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీసింది. అంతేకాదు.. కాబోయే భార్యలు కూడా చాలా డేంజర్ అని.. వాళ్లతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన నిరూపించింది.

ఓ మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలు ఓ పుస్తకం చదువుతోంది. ఆ పుస్తకం అట్ట మీద భర్తను ఎలా చంపాలి అని రాసి ఉంది. పైగా ఆ పుస్తకం భారీగా అమ్ముడుపోయింది కూడా. నేటి కాలంలో యూ ట్యూబ్ ను చూసి చాలామంది హత్యలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు భర్తలను ఎలా చంపాలో భార్యలు పుస్తకాలు చూసి తెలుసుకుంటున్నారు.

గత ఏడాది ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘు వంశీ తన భార్య చేతిలో హతమయ్యాడు. అతడిని మేఘాలయ విహారయాత్రకి తీసుకెళ్లిన భార్య.. తన ప్రియుడితో చంపించేసింది. ఈ సంఘటన గత ఏడాది దేశాన్ని ఉలిక్కి పడేవిధంగా చేసింది. ఇప్పుడు దానిని మించిపోయింది పూనే వ్యాపారవేత్త కేసు. వాస్తవానికి ఇలా మహిళలు ఎందుకు మారిపోతున్నారు.. ఏకంగా పుస్తకాలు చదివి భర్తలను ఎందుకు అంతం చేస్తున్నారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ఒకవేళ నచ్చకపోతే వేరుగా ఉండవచ్చు.. విడాకులు కూడా తీసుకోవచ్చు. నచ్చిన వ్యక్తులతో జీవించవచ్చు. ఈ సౌలభ్యం మన రాజ్యాంగం అందించింది. కానీ వీటిని ఉపయోగించుకోకుండా.. అత్యంత దారుణాలకు పాల్పడడం. ఘోరాలకు ఒడికట్టడం అత్యంత పాపమని మానసిక విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper