Gas Pipeline News Update: సాధారణంగా మమ్మీలు ఈజిప్ట్ ప్రాంతంలో ఉంటాయి. ఈజిప్టులో ఒకప్పుడు చనిపోయిన వారిని ఖననం లేదా దహనం చేయకుండా అలానే ఉంచేవారని.. కార్యక్రమంలో వారు మమ్మీలుగా మారిపోయారని అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఇక మమ్మీల గురించి హాలీవుడ్లో అనేక సినిమాలు రూపొందాయి. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. హర్రర్ కథాంశంతో మమ్మీ చిత్రాలను నిర్మించడం.. అవి ప్రేక్షకులకు సరికొత్తగా కనిపించడంతో కాసుల వర్షం కురిపించాయి. అయితే ఇప్పుడు మమ్మీ లు కేవలం ఈజిప్ట్ లో మాత్రమే కాదని.. ఇతర దేశాలలో కూడా ఉన్నాయని నిరూపితమైంది. ఇందుకు సంబంధించిన ఒక వార్త అంతర్జాతీయ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అమెరికాకు దగ్గర్లో ఉండే పెరూ ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్ కోసం తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాలలో వందలాదిమంది కార్మికులు పాలుపంచుకుంటున్నారు. అయితే ఇటీవల జరిపిన తవ్వకాలలో ఊహించని విధంగా ఒక వస్తువు కనిపించింది. దానిని చూసిన కార్మికులు ఆశ్చర్యపోయారు. పరిశీలించిన అధికారులు షాక్ కు గురయ్యారు.
పెరూ రాజధాని లిమాలో గ్యాస్ పైప్లైన్ కోసం తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాలలో ఒక విచిత్రమైన వస్తువు కార్మికులకు కనిపించింది. దీంతో వారు దానిని అధికారులకు చూపించారు. వారి కాస్త పురావస్తు శాఖ సిబ్బందికి సమాచారం పంపించడంతో వారు క్షేత్రస్థాయికి వచ్చారు. ఆ తర్వాత ఆ వస్తువును పరిశీలించారు.. అది మమ్మీ అని.. దాని చరిత్ర 1000 సంవత్సరాల క్రితం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పేరు గ్యాస్ సంస్థ కాలిడా వెల్లడించింది. అయితే ఆ మమ్మీ 20 లేదా 20 సంవత్సరాల ఒక మహిళదని.. దాని చరిత్ర 1000 సంవత్సరాల వరకు ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ” గ్యాస్ పైప్ లైన్ కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలలో ఒక విచిత్రమైన వస్తువు కనిపించిందని ఇక్కడ సిబ్బంది చెప్పారు. దాన్ని పరిశీలిస్తే 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దానిపై ఇంకా పరిశీలన చేయాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో ఇలాంటి వస్తువు దొరకడం నిజంగా ఆశ్చర్యమేనని.. అయితే ఈ ప్రాంతాల్లో ఇంకా తవ్వకాలు జరిపితే ఇలాంటివి బయటపడే అవకాశం ఉందని” పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు.
Also Read: Vishwak Sen – Samantha : సమంత ఏడ్చింది విశ్వక్ సేన్ ఏడవలేదు.. మిగతాదంతా సేమ్ టు సేమ్!
వాస్తవానికి మమ్మీలు ఈజిప్ట్ ప్రాంతంలోనే ఉంటాయి. ఆ పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు చేపడితే ఇప్పటికి వాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో మమ్మిలు కనిపించడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వెనకటి కాలంలో ఈ ప్రాంతంలో కూడా మమ్మీల సంస్కృతి కొనసాగిందని.. అందువల్లే ఇలాంటి ఆనవాళ్లు బయటపడుతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో మరింత విస్తృతంగా తవ్వకాలు గనుక చేపడితే ఇంకా ఎక్కువ సంఖ్యలో మమ్మీల ఆనవాళ్లు వెలుగు చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.