Kubera Ticket Rates AP: భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు టికెట్ రేట్స్ ని ఆశించడం సర్వ సాధారణం. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి, ఆ సినిమా వ్యాపారం లో ఉన్న ప్రతీ ఒక్కరికి లాభాలు రావాలంటే ఆ మాత్రం టికెట్ హైక్స్ ఇవ్వాల్సిందే. ఇది జగన్ ప్రభుత్వం లో అంత తేలికైన పని కాదు. ఆయనకు అనుకూలంగా ఉండేవాళ్ళకు మాత్రమే టికెట్ హైక్స్ ఇచ్చే వాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యి, ఆయన పార్టీ ఖాతాలోనే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఉండడం తో,నిర్మాతలు ఎంత టికెట్ రేట్ కోరితే అంత టికెట్ రేట్ ఇవ్వడానికి సిద్దమైపోతున్నారు. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన సినిమాని అడ్డుకోవాలని చూసినందుకు నిర్మాతలపై ఫైర్ అయ్యి, ఇక మీదట చూసుకుంటా మీ సంగతి అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక నుండి టికెట్ రేట్స్ రావడం అంత తేలికైన పని కాదని అందరు అనుకున్నారు. కానీ రేపు విడుదల కాబోతున్న ‘కుబేర'(Kubera Movie) చిత్రానికి భారీగా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రేట్స్ మీద ఏకంగా 75 రూపాయిలు పెంచుతూ కాసేపటి క్రితమే జీవో ని జారీ చేశారు. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పట్టుమని 30 కోట్ల రూపాయిల బడ్జెట్ కూడా లేని సినిమాకు ఇంత టికెట్ రేట్స్ పెంచుకోడానికి అనుమతిని ఇస్తారా?, అడిగిన నిర్మాతకు,మీకు కాస్త అయినా జనాలు గుర్తుకు రాలేదా అంటూ పవన్ కళ్యాణ్ ని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ తిడుతున్నారు. అసలే ఓటీటీ కాలం లో మీడియం రేంజ్ సినిమాలను థియేటర్స్ లో చూడడం చాలా వరకు జనాలు ఆపేసారు. ఇలాంటి సమయంలో ఇలా టికెట్ రేట్స్ పెంచుకుంటూ పోతే థియేటర్స్ కి వచ్చే ఆ కాస్త మంది కూడా కట్ అవుతారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Actor Brahmaji: “జగన్ సర్ అందరికీ వరాలిస్తున్నారు.. వాళ్ల వైపూ కాస్త చూడండి”
అప్పట్లో #RRR చిత్రానికి ఇలాగే 75 రూపాయిల వరకు టికెట్ రేట్ ని పెంచుకోవచ్చని అప్పటి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇప్పుడు కుబేర కి కూడా అదే స్థాయి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. #RRR రేంజ్ ఎక్కడా.. కుబేర రేంజ్ ఎక్కడ?, రెండు సినిమాలకు సమానమైన టికెట్ రేట్స్ పెంచుకోవడమంటే ఏమైనా న్యాయం గా అనిపిస్తుందా మీరే చెప్పండి. ఇప్పుడు కుబేర ని సింగల్ స్క్రీన్స్ లో చూడాలంటే సగటు ప్రేక్షకుడు ఒక్కో టికెట్ ని కొనుగోలు చేయడానికి 236 రూపాయిలు ఖర్చు చేయాల్సిందే. అదే విధంగా మల్టీ ప్లెక్స్ కి అయితే 265 రూపాయిలు ఖర్చు చేయాలి. పది రోజుల వరకు ఇవే రేట్స్ వర్తిస్తాయి. సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి కదిలి వెళ్లడం అసాధ్యమే.