1941 And 2025 Calendar Same: 2025 ఏడాది ప్రారంభం నుంచి అనేక ఘోరాలు జరుగుతూ ఉన్నాయి.. ఓవైపు విమాన ప్రమాద సంఘటనలు.. మరోవైపు ఇతర దేశాలతో యుద్ధాలు.. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం.. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు సంక్షోభంలోనే గడిచిపోయిందని కొందరు మేధావులు చెబుతూ ఉన్నారు. అయితే ఇదే పరిస్థితి 85 ఏళ్ల కింద కూడా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అంటే 1941లో కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయని అంటున్నారు. అందుకు కారణం ఏంటంటే ఆ ఏడాది.. ఇప్పుడు నడుస్తున్న ఏడాది క్యాలెండర్ ఒకటే కావడం. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరగబోతుంది?
Also Read: త్రయంబకేశ్వర్ శివుడి మూడో కన్ను వజ్ర రహస్యం.. దోచుకున్న బ్రిటీష్ వారి సర్వనాశనం..
ప్రస్తుతం మనం వాడుతున్నది గ్రేగోరియన్ క్యాలెండర్. దీనిని భూ కక్ష ఆధారంగా రూపొందించారు. ఈ క్యాలెండర్ ప్రకారం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక లీపు సంవత్సరం వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం 365 రోజులు ఉంటే.. నీకు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. అయితే ఇలా ఉంటూ వస్తూ కొన్ని సంవత్సరాలు సేమ్ టు సేమ్ అన్నట్లు వస్తుంటాయి. అలా 1941 వ సంవత్సరం… 2025వ సంవత్సరం క్యాలెండర్ ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 1941లో ఏం జరిగిందో… ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అంటున్నారు. ఇంతకీ 1941లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
1941 వ సంవత్సరం పేరు చెప్తే ప్రపంచం వనికి పోతుంది. ఎందుకంటే ఈ ఏడాదిలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఏడాది మే 20న ప్రారంభమైంది. జూన్ 22న జర్మనీ, రష్యాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు కీవ్ యుద్ధం కొనసాగింది. డిసెంబర్ 7న జపాన్ మిలిటరీ అమెరికాలోని పేర్లు హార్బర్ పై దాడి చేయడంతో 2400 మంది అమెరికాలు చనిపోయారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇవే కాకుండా అనేక ప్రమాదాలు.. బాంబు దాడులు.. ఆకలి చావులతో ప్రజలు అల్లకల్లోల పరిస్థితులు ఎదుర్కొన్నారు.
అయితే 2025 ప్రారంభం నుంచి అవే కొనసాగుతున్నాయని కొందరు అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కొనసాగింది. అంతకుముందు నుంచే రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే గుజరాత్లో విమానా ప్రమాదకటన ఆందోళనకరంగా సాగింది. ఈ ఘటనలో 20070 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే పహాల్గాం సంఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం అమెరికాతో భారత్ విభేదాలు కొనసాగుతున్నాయి. థాయిలాండ్, తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: నేను వెళ్లే సమయం ఆసన్నమైంది.. వెబ్ సిరీస్ చూసి 14 ఏళ్ల బాలుడు చేసిన పని సంచలనం..
ఇప్పటివరకు జరిగిన ఎనిమిది నెలల్లో ఎన్ని సంఘటనలు జరిగాయి. మరో ఐదు నెలల వరకు ఇంకెన్ని సంఘటనలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే 1941లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరిగింది. కానీ ఈ సమయంలో కొన్ని దేశాలు యుద్ధం ప్రకటిస్తున్నా.. కొన్ని దేశాల జోక్యంతో వెనుకడుగు వేస్తున్నాయి. అయితే ఈ చివరి వరకు ఏం జరుగుతుందో చూడాలి.