Trimbakeshwar Temple Mystery: మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న త్రయంబకేశ్వర్ ఆలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. సాధారణంగా శివాలయంలో మహాశివుడు ఒకే శివలింగం రూపంలో దర్శనం ఇస్తారు. కానీ త్రయంబకేశ్వర్ ఆలయంలో మూడు శివలింగాలు ఉంటాయి. అయితే ఇవి అన్నివేళలా కనిపించవు. త్రయం అంటే 3. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఇక్కడ కొలువై ఉన్నారని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఈ శివలింగాలను గోదావరి ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉంటుందని అంటున్నారు.
Also Read: వర్షాకాలంలో టూర్ ఎక్కడికి బెటర్..చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!
త్రయంబకేశ్వర్ ఆలయం గౌతముడు, అహల్య చరిత్రతో ముడిపడి ఉంది. పూర్వకాలంలో ఇక్కడ కరువు ఎక్కువగా ఉండేది. దీంతో నీటి కోసం గౌతముడు ఘోర తపస్సు చేస్తాడు. అయితే శివుడు ప్రత్యక్షమై ఎప్పటికీ ఎండిపోని ఒక బావిని అందిస్తాడు. అంతేకాకుండా శివుడిని కూడా ఇక్కడే ఉండాలని కోరుతాడు. అందుకు శివుడు వరం ప్రసాదిస్తాడు.అయితే ఇది నచ్చని కొందరు ఋషులు గౌతముడిపై నింద మోపాలని చూస్తారు. ఇందులో భాగంగా ఒక ఆవును తీసుకువచ్చి తన ఇంటి ముందు వదిలేస్తారు. గౌతముడు ఆవును పక్కకు నెట్టగా.. అది చనిపోతుంది. దీంతో గోహత్య నేపం గౌతముడిపై పడుతుంది. ఈ సమయంలో మరోసారి తనకు సాయం చేయాలని తపస్సు చేస్తాడు గౌతముడు. ప్రత్యక్షమైన శివుడు అసలు నిజం చెబుతాడు. అలా గౌతముడు చేసిన తపస్సుతో గోదావరి పుట్టిందని.. అప్పటినుంచి శివుడు ఇక్కడ కొలువై ఉండి త్రయంబకేశ్వరుడు గా కొనసాగుతున్నాడని చరిత్ర తెలుపుతుంది.
కొన్నాళ్ల తర్వాత ఇక్కడున్న త్రయంబకేశ్వరుడికి ఆలయాన్ని కట్టించారు. అయితే ఈ ఆలయం బసాల్ట్ స్టోన్ తో నిర్మించారు. అలాగే ఆలయ చుట్టూ అద్భుతమైన విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ ఆలయంలో శివుడు కిందికి ఉంటాడు. ఇలా లోపల మూడు శివలింగాలను కేవలం సోమవారం మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది.
అయితే ప్రతి సోమవారం భక్తుల దర్శనం తర్వాత వజ్రాలు, బంగారు ఆభరణాలు పొదిగిన కిరీటాన్ని ధరిస్తారు. దీనినే హేమ కలశం అని అంటారు. ఇందులో శివుడి మూడో కన్నులో ఒక వజ్రం ఉండేది. ఇది కోహినూరు తర్వాత అత్యంత విలువైన వజ్రంగా పేర్కొంటారు. నాసిక్ వజ్రంగా పేర్కొనే దీనిని పేశ్వాలు శివుడికి అందించారు. కానీ ఆ తర్వాత దీనిని బ్రిటిష్ కాలంలో గవర్నర్ లారెన్ వాస్టింగ్ లండన్ కు తరలించారు. కొన్నాళ్ల తర్వాత ఓ ప్రైవేట్ కలెక్టర్ వద్దకు ఇది చేరినట్లు తెలుస్తోంది.
Also Read: నల్ల సముద్రం (Black Sea) లో ఉన్న రహస్యాలు ఏంటో తెలుసా?
అయితే ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వారి జీవితాలు చిన్న భిన్నంగా మారుతాయని.. ఆ ప్రదేశం అల్లకల్లోలంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. బ్రిటిష్ వారు ఈ వజ్రం తీసుకు వెళ్లిన తర్వాత వారి మధ్య యుద్ధాలు జరిగాయని చరిత్ర తెలుపుతోంది. పలువురి చేతులు మారిన తర్వాత ఈ వజ్రం పునర్నిర్మానం చేయబడింది. కానీ ఆ వజ్రం తేజస్సు తగ్గిపోయింది. జెపి మోహన్ వంటి వారు దీనిని దక్కించుకున్నారు. కానీ వారి కుటుంబంలో అనేక విధ్వంసాలు జరగడంతో దానిని చేజార్చుకున్నారు. చివరికి అది ఒక ప్రైవేట్ వ్యక్తి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.