HomeజాతీయంRabies Survivor : కుక్క కరిచింది.. కుక్కల మొరిగాడు.. మూడు రోజుల్లో చనిపోతాడు అన్నారు.. కానీ...

Rabies Survivor : కుక్క కరిచింది.. కుక్కల మొరిగాడు.. మూడు రోజుల్లో చనిపోతాడు అన్నారు.. కానీ అద్భుతం జరిగిందిలా..

Rabies Survivor : ఓ బాలుడు వింత ప్రవర్తనతో కొనసాగాడు. అతనికి వచ్చిన వ్యాధితో మరో రెండు రోజుల్లో చనిపోతాడని వైద్యులే ధ్రువీకరించారు. దీంతో అతడిని చీకటి గదిలో బంధించాలని కూడా ఆదేశించారు. కానీ ఊహించని విధంగా అతడు సాధారణ వ్యక్తి అయ్యాడు. అంతేకాకుండా ఇప్పుడు పాఠశాలకు వెళ్లి తోటి విద్యార్థులతో సంతోషంగా ఉన్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఎవరు? అసలు ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ కు చెందిన 15 ఏళ్ల బాలుడు కుక్కల […]

Rabies Survivor : ఓ బాలుడు వింత ప్రవర్తనతో కొనసాగాడు. అతనికి వచ్చిన వ్యాధితో మరో రెండు రోజుల్లో చనిపోతాడని వైద్యులే ధ్రువీకరించారు. దీంతో అతడిని చీకటి గదిలో బంధించాలని కూడా ఆదేశించారు. కానీ ఊహించని విధంగా అతడు సాధారణ వ్యక్తి అయ్యాడు. అంతేకాకుండా ఇప్పుడు పాఠశాలకు వెళ్లి తోటి విద్యార్థులతో సంతోషంగా ఉన్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఎవరు? అసలు ఏం జరిగింది?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ కు చెందిన 15 ఏళ్ల బాలుడు కుక్కల మొరగడం ప్రారంభించారు. అతని నోటి నుంచి నిరంతరం లాలాజలం వస్తుండేది. 2025 డిసెంబర్లో అతనికి కుక్క కరిచిన తర్వాత 2026 మార్చి 16 నుంచి అతనిలో లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడికి చికిత్స చేసిన వైద్యులు కోల్పోవడం కష్టమని తీర్చేశారు.

మార్చి 13వ తేదీన సాయంత్రం కరణ్ ఇంటికి వచ్చి అకస్మాత్తుగా పడిపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కరణ్ ను చీర తీసిన తర్వాత కుక్కలా మొరగడం ప్రారంభించాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని కరణ్ ను అడగగా ఏమీ మాట్లాడలేకపోయాడు. అయితే కరెంట్ కుటుంబం పేదరికంలో ఉన్నందున ఆసుపత్రికి కాకుండా సమీపంలోని రామ్ జానకి ఆలయానికి తీసుకువెళ్లారు. కానీ అక్కడ పరిస్థితి మరింత దిగజారడంతో అప్పుడు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత తాము చికిత్స చేయలేము అని చెప్పారు. ఆ తర్వాత కచ్వా క్రిస్టియన్ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా వైద్యులు ప్రాణాలపై హామీ ఇవ్వలేదు. అంతేకాకుండా అతడిని చీకటి గదిలో బంధించాలని చెప్పారు. లేకుంటే అతని వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని చెప్పారు. మరో మూడు లేదా నాలుగు రోజుల్లో చనిపోతాడని కూడా చెప్పారు.

దీంతో కరణ్ కుటుంబం ఆవేదనతో కృంగిపోయింది. అయితే చివరి ఆశగా అతనిని కపిల్ చౌర ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత కరణ్ పై కొన్ని నీళ్లు చల్లారు. దీంతో అతడు వణికిపోయాడు. ఇక్కడ కూడా వైద్యులు ఆశలు వదులుకోవాలని చెప్పారు. చివరికి అతడిని వారణాసిలోని హర్హువా హెల్త్ సెంటర్ కు తీసుకురమ్మని తమ బంధువులు చెప్పారని కరణ్ తండ్రి బైలాల్ తెలిపాడు. అక్కడ తన కుమారుడికి ఒక వ్యాక్సిన్ ఇచ్చారు. మూడు రోజుల తర్వాత మరో వ్యాక్సిన్ అందించారు. ఆ తర్వాత వారంలో రెండు వ్యాఖ్యలు ఇచ్చారు. ఇప్పుడు కరణ్ పూర్తిగా కోలుకున్నట్లు బైలాల్ తెలిపారు.

ఇప్పటివరకు రేబిస్ లక్షణాలతో చనిపోయిన వారే ఉన్నారు కానీ.. ఇలా బతకడం అద్భుతమైన విషయం అని చాలామంది కొనియాడుతున్నారు. ప్రస్తుతం కరణ్ 9వ తరగతి చదువుతున్నాడు. తన పాఠశాలలో విద్యార్థులతో హాయిగా ఉంటున్నాడు. అయితే కరణ్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైన తర్వాత పాఠశాలకు వెళ్లినా కూడా అక్కడివారు ఎలాంటి వివక్ష లేకుండా అతనితో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా కరణ్ తల్లి చిన్నప్పుడే మరణించింది. తండ్రి పక్షవాతానికి గురయ్యారు. కరణ్ కు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper