TANA Immigration Seminar : అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) శ్రీకారం చుట్టింది. ‘ఇమ్మిగ్రేషన్ 360°’ (Immigration 360°) పేరుతో ఒక ప్రత్యేక అవగాహన సదస్సును తానా నిర్వహించనుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తరచూ మారే నిబంధనలు.. వీసా ప్రక్రియలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగబోతోంది. కావున అందరూ మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదో చక్కటి వేదికగా డా. ఉమాగారు పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇమ్మిగ్రేషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ న్యాయవాది ముఖ్య వక్తగా ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి హాజరుకానున్నారు. యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలు, ఉద్యోగ ఆధారిత వీసాలు (H-1B, Green Card), కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్, లీగల్ స్టేటస్‌కు సంబంధించిన సమస్యలు, ఇటీవలి కాలంలో వచ్చిన కీలక మార్పులు.. తాజా పరిణామాలపై ఆయన సవివరంగా చర్చించనున్నారు.
ముందుగానే ప్రశ్నలు పంపే అవకాశం
ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి సందేహాలు, ఆందోళనలు ఉన్న కమ్యూనిటీ సభ్యులు తమ ప్రశ్నలను సదస్సుకు ముందుగానే సమర్పించే వెసులుబాటును తానా కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ ప్రశ్నావళి ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతినిధులు తమ సమస్యలు లేదా సందేహాలను ఈ ఫారమ్ ద్వారా నమోదు చేయవచ్చు.
ముందుగా అందిన ప్రశ్నల ఆధారంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న, ఎక్కువ మందిని ప్రభావితం చేసే అంశాలను వర్గీకరించి సదస్సులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. అంతేకాకుండా, హాజరైన వారికి న్యాయవాదితో నేరుగా మాట్లాడి తమ అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.
కమ్యూనిటీకి గొప్ప అవకాశం
అమెరికాలో ఉద్యోగ, విద్య, వ్యాపార నిమిత్తం ఉంటున్న వేలాది మంది తెలుగువారికి ఇమ్మిగ్రేషన్ నియమావళిపై స్పష్టత ఉండటం ఎంతో అవసరం. వివిధ ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్లు, స్టేటస్ సంబంధిత చిక్కులు, చట్టపరమైన మార్గదర్శకాలపై సరైన సమాచారం లేక ఇబ్బంది పడేవారికి ఈ వేదిక ఒక చక్కటి పరిష్కారంగా నిలుస్తుందని తానా పేర్కొంది.
కమ్యూనిటీ సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ప్రశ్నలను ముందస్తుగా పంపడమే కాకుండా, ఈ ‘ఇమ్మిగ్రేషన్ 360°’ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తానా ప్రతినిధులు పిలుపునిచ్చారు. సదస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆన్‌లైన్ ఫారమ్ లింక్‌ను తానా అధికారిక మాధ్యమాల ద్వారా పొందవచ్చని సూచించారు.
Submit Your Questions:
https://tinyurl.com/kew2hwr7
Join the Seminar on
https://us06web.zoom.us/j/81571740663?pwd=dDn5eFF5pfbV24bqDbvRzZK1AodfvX.1
Meeting ID: 815 7174 0663
Passcode: 106437