spot_img
Homeఅంతర్జాతీయంTANA President Lavu Anjaiah Chowdary : జన్మనిచ్చిన సొంత గ్రామానికి సేవా చేయడంలో ఆత్మసంతృప్తి...

TANA President Lavu Anjaiah Chowdary : జన్మనిచ్చిన సొంత గ్రామానికి సేవా చేయడంలో ఆత్మసంతృప్తి ఎక్కువ: లావు అంజయ్య చౌదరి

TANA President Lavu Anjaiah Chowdary : జన్మనిచ్చిన సొంత గ్రామానికి సేవ చేయటంలో కలిగే సంతృప్తి మరెక్కడా దొరకదని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి ఆర్.సీఎం స్కూల్ లో ‘తానా చైతన్య స్రవంతి’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మెగా క్యాన్సర్ క్యాంపు, వైద్యశిబిరం, కంటి వైద్య శిబిరం, రైతు కోసం అనాథ పిల్లలకు దుస్తులు, స్కాలర్ షిప్ లు అందజేశారు. అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘తానా ఆధ్వర్యంలో తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో సంప్రదాయ, సాంస్కృతిక కళలు, సేవా కార్యక్రమాలు డిసెంబర్, జనవరి నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతరించిపోతున్న సంస్కృతిక సంప్రదాయాలు, మళ్లీ మనవారికి పరిచయం చేసేందుకు తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించే సంస్కృతిక కళోత్సవాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.

జన్మనిచ్చిన స్వగ్రామాలకు తమ వంతు బాధ్యతగా సేవ చేయాలనే ఉద్దేశంతో తానా చైతన్య స్రవంతి అద్భుత కళాధామం, అంకిత సేవాభావం పేరుతో డిసెంబర్, జనవరి నెల మొదటి వారంలో తానా ఆధ్వర్యంలో సాంస్కృతిక కళోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని లావు అంజయ్య చౌదరి తెలిపారు. విద్యార్థులకు సహాయం, రైతులకు సాయం, తదితర శిక్షణ కార్యక్రమాలతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తానా ప్రధాన ఉద్దేశం అంతరించిపోతున్న కళలు, సాంస్కృతిక , చెక్క భజన, కోలాటం జానపద నృత్యాలు పాటలను ప్రోత్సహించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తెలుగు ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అందుకు ప్రతీ ఒక్కరి సహకారం అవసరం అన్నారు.

ఈ కార్యక్రమంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, మాజీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, తానా సభ్యులు పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper