HomeNewsTamil Nadu News: భర్త చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఆనందంగా భార్య మాటలు.. విచారణలో విస్తుపోయే...

Tamil Nadu News: భర్త చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఆనందంగా భార్య మాటలు.. విచారణలో విస్తుపోయే నిజాలు..

Tamil Nadu News: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి. విలువలకు కట్టుబడి ఉండేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారని ఈ సందర్భంగా మానసిక నిపుణులు చెప్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. డీఎంకే నేత ఒకరు ఇటీవల చనిపోగా, ఆయన మరణం సహజంగా జరిగిందని అనుకున్నారు. కానీ, అది హత్య అన్న సంగతి తన భార్య ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

Tamil Nadu News
Tamil Nadu News

తమిళనాడు స్టేట్.. శివగంగ డిస్ట్రిక్ట్ దేవకొట్టై తాలూకాలోని సదయంకాడు అనే గ్రామానికి చెందిన దేవేంద్రన్ డీఎంకే నేత. కాగా, ఈయన పార్టీ కోసం కట్టుబడి పని చేశాడు. దాంతో స్థానికంగా ఈయనకు మంచి పేరు కూడా ఉంది. కాగా, ఇటీవల ఆయన అనారోగ్యం పాలు కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ పరిస్థితి విషమించి దేవేంద్రన్(46) ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అలా ఈయన మరణించడం పట్ల డీఎంకే పార్టీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: టూత్ బ్రష్ చరిత్ర మీకు తెలుసా.. అప్పట్లో అది ఎలా ఉండేది, ఎవరు తయరుచేశారంటే..?

దేవేంద్రన్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే దేవేంద్రన్ మరణించన తర్వాత 15 రోజులకు తమ్ముడు సతీష్ దేవేంద్రన్ అన్న ఇంటికి వెళ్లాడు. అక్కడ తన అన్న భార్య అనగా వదిన సూర్యను చూసి షాక్ అయ్యాడు. భర్త చనిపోయి 15 రోజులు కూడా కాలేదు. అంతలోనే ఆమె ఆనందంగా నవ్వుతూ ఫోన్ లో మాట్లాడుతున్నది. అది గమనించిన సతీష్..తన అన్నది సహజ మరణం కాదని అనుమానించాడు. దేవేంద్రన్ భార్య సూర్య ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేశాడు. తద్వారా సూర్యకు అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు ధ్రువీకరించుకున్నాడు.

ఈ విషయం పోలీసులకు తెలపడంతో పోలీసులు.. చంద్రశేఖరన్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది. సూర్య ప్లాన్ ప్రకారం తన భర్త దేవేంద్రన్ ను చంపినట్లు తెలుసుకున్నారు. దేవేంద్రన్ కు పెట్టిన భోజనంలో ఎలుకల ముందు కలిపింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురై చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేసింది సూర్య. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. భార్య అలా తన భర్త ప్రాణాలు తీసిందా అని ఆశ్చర్యపోయారు.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Samyuktha Menon: మలయాళీ నటి సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్‌’తో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అందులో ఆమె రానా సరసన నటించింది. కాగా.. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఆమె మరో భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్‌ గా సంయుక్త ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో మహేష్ మరదలిగా ఈ మలయాళ బ్యూటీ ఎంపిక అయిందట. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular