HomeNewsRajinikanth Kamal Haasan reunion video: రజినీకాంత్ , కమల్ హాసన్ రీ యూనియన్ వీడియోలో...

Rajinikanth Kamal Haasan reunion video: రజినీకాంత్ , కమల్ హాసన్ రీ యూనియన్ వీడియోలో కనిపించిన ఈ అమ్మాయి నిజం కాదా..?

Rajinikanth Kamal Haasan reunion video: 47 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) , కమల్ హాసన్(Kamal Hassan) కలిసి ఒక భారీ మల్టీస్టార్రర్ చిత్రం చేయబోతున్న సందర్భంగా , రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు లెజెండ్స్ ని అలా ఒకే ఫ్రేమ్ లో వాళ్ళ […]

Rajinikanth Kamal Haasan reunion video: 47 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) , కమల్ హాసన్(Kamal Hassan) కలిసి ఒక భారీ మల్టీస్టార్రర్ చిత్రం చేయబోతున్న సందర్భంగా , రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు లెజెండ్స్ ని అలా ఒకే ఫ్రేమ్ లో వాళ్ళ స్టైల్ లో నడిచి వస్తుండడం చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. అయితే వాళ్లిద్దరూ కారు ఎక్కుతున్న సమయం లో , ఒక అందమైన అమ్మాయి వాళ్ళిద్దరి వైపు చూస్తూ , వయ్యారాలు పడుతూ ఉంటుంది గమనించారా ?, ఈ అమ్మాయి ఎవరూ ఎప్పుడు చూడలేదు , చాలా అందంగా ఉందే అని కుర్రాళ్ళు సోషల్ మీడియా లో ఆమెని వెతకడం మొదలు పెట్టారు.

కానీ ఆ అమ్మాయి ఎక్కడా దొరకలేదు , బాగా పరిశీలించి చూస్తే ఆ వీడియో లో కనిపించింది నిజమైన అమ్మాయి కాదట. AI ద్వారా కృత్రిమం గా తయారు చేయబడిన అమ్మాయి అట. అసలు నమ్మశక్యంగా లేదు కదూ ?, కానీ అది నిజమే. ఆ అమ్మాయి నిజంగానే AI ద్వారా క్రియేట్ చేయబడినది. అంత అవసరం ఏముంది ?, ఇంత పెద్ద భారీ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ , ఆమాత్రం నిజమైన అమ్మాయిని తెచ్చి పెట్టలేరా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మొదట్లో షూట్ చేసేటప్పుడు అక్కడ అమ్మాయిని పెట్టాలనే ఆలోచనే రాలేదని, ప్రోమో షూటింగ్ జరిగిన తర్వాత వీడియో ని ఎడిటింగ్ రూమ్ లో చూస్తున్నప్పుడు ఎందుకో అక్కడ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అనిపించి AI ద్వారా క్రియేట్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం పై సోషల్ మీడియా లో హాట్ టాపిక్ నడుస్తోంది.

ఇకపోతే ఈ క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రానికి జైలర్ సిరీస్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా , అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ తన ఫోకస్ మొత్తం ‘జైలర్ 2’ మీదనే పెట్టాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన కమల్ హాసన్ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్’ నిర్మించే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకనే ఈ క్రేజీ మల్టీస్టార్రర్ సెట్స్ మీదకు వెళ్లనుంది. 2027 వ సంవత్సరం లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper