Best Upcoming SUVs: త్వరలో రాబోతున్న బెస్ట్ SUVలు ఇవే.. మీరు ఏ కారు కొనాలనుకుంటున్నారు?
నిన్నా మొన్నటి వరకు సొంత కారు కావాలనుకునేవారు.. చిన్న కారును కొనుగోలు చేసేవారు. అందులోనూ బడ్జెట్ లో మాత్రమే వెహికల్ తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఎక్కువగా SUV కార్లను కోరుకుంటున్నారు. కాస్త విశాలమైన స్పేస్ తో పాటు హుందాగా కనిపించేందుకు వీటిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే వినియోగదారుల అవసరాలను, కోరికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మార్కెట్లోకి SUVలను తీసుకువస్తున్నాయి. ఇందులో టాప్ 5 గురించి తెలుసుకుందాం..
సుదూరప్రయాణాలు చేసేవారు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారు తమకు సౌకర్యం ఉన్న కార్లను కావాలని అనుకుంటారు. వీరి కోసం జేఎస్ డబ్బ్యూ కంపెనీ నుంచి కొంత్తగా PHEV SUV కానుంది. ఇది రగ్గడ్ లుక్ తో ఉండనుంది. టీ2 ఆధారంగా తయారువుతున్న ఈ కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండడంతో చాలా దూరం వెళ్లేవారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో నేటి తరం వారు కోరుకునే పనోరమిక్ సన్ రూఫ్ ఉండనుంది.
మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా 3 డోర్ ఫేస్ లిప్ట్ కారు రాబోతుంది. ఇందులో ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్, గ్రిల్ ఆకట్టుకోనున్నాయి. అలాగే పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజిన్ కూడా ఉండడంతో ఇది 4 డబ్ల్యూడీ సామర్థ్యాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటీరియర్ డిజైన్ కూడా ఆకట్టుకోబోతుంది.
టాటా కంపెనీ నుంచి ఎస్ యూవీ రావడం కొత్త విషయం కాదు. కానీ లేటేస్ట్ గా వినియోగదారులను ఆకట్టుకోవడానికి సఫారీ ఈవీ రాబోతుంది. ఇందులో హెడ్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా మార్చారు. అలాగే కొత్త బంఫర్, మెరుగైన ఇంటీరియర్ వంటి మార్పులు చేశారు. ఈ ఈవీలో 65 కిలో వాట్ తో పాటు 75 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. పెద్ద టచ్ స్క్రీన్ తో పాటు 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇదే కంపెనీ కి చెందిన సియెర్రా ఐసీఈ ఏడబ్బ్యూడీ అనే కారు రాబోతుంది. ఇందులో పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజిన్ ఉండనుంది. ఇది కఠినమైన రోడ్లపై కూడా సులువుగా వెళ్లగలుగుతుంది.
టయోటా నుంచి ఫార్య్యునర్ కొత్త తరంగా రాబోతుంది. ఇందులో సేప్టీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. అడాస్ టెక్నాలజీతో పాటు పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే డిజైన్ కూడా ఆకట్టుకోనుంది.