Homeజాతీయం - అంతర్జాతీయంIndia boycott Turkey: భారత్‌ బాయికాట్‌ దెబ్బ.. అడుక్కుతినే పరిస్థితికి తుర్కియే!

India boycott Turkey: భారత్‌ బాయికాట్‌ దెబ్బ.. అడుక్కుతినే పరిస్థితికి తుర్కియే!

India boycott Turkey: తుర్కియే.. పర్యాటక దేశం. పర్యాటకరంగం ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు. ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు వరకు తుర్కియేతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. భూకంప సమయంలో భారత్‌ పెద్ద ఎత్తున సాయం చేసింది. మన సైన్యాన్ని పంపించి వేల మంది ప్రాణాలు కాపాడింది. మందులు, వైద్య సేవలు అందించింది. కానీ, ఏమాత్రం కృతజ్ఞతలేని తుర్కియే ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ పంచన నిలచింది. సీజ్‌ ఫైర్‌ తర్వాత భారత మిత్రులు ఎవరో శత్రువులు […]

India boycott Turkey: తుర్కియే.. పర్యాటక దేశం. పర్యాటకరంగం ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు. ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు వరకు తుర్కియేతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. భూకంప సమయంలో భారత్‌ పెద్ద ఎత్తున సాయం చేసింది. మన సైన్యాన్ని పంపించి వేల మంది ప్రాణాలు కాపాడింది. మందులు, వైద్య సేవలు అందించింది. కానీ, ఏమాత్రం కృతజ్ఞతలేని తుర్కియే ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ పంచన నిలచింది. సీజ్‌ ఫైర్‌ తర్వాత భారత మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో క్లారిటీ వచ్చింది. భారత్‌కు శత్రువుగా మారిన తుర్కియేను ఆర్థికంగా దెబ్బ కొట్టింది భారత్‌. దేశంలోని విమానాశ్రయాల నిర్వహణ ఒప్పందం రద్దు చేసింది. అనేక కీలక అగ్రిమెంట్లు క్యాన్సిల్‌ చేసింది. కాశ్మీర్‌ విషయంలో భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేసిన ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌ వ్యాఖ్యలు, పాకిస్తాన్‌కు ఆయుధ సరఫరాతోభారత్‌ బాయికాట్‌ నినాదం అందుకుంది.

టూరిజానికి పెద్ద దెబ్బ..
భారత్‌ బాయికాట్‌ నినాదంతో తుర్కియేకు వెళ్లే పర్యాటకులు గణనీయంగా తగ్గిపోయారు. 2024లో భారత్‌ నుంచి 3.30 లక్షల మంది పర్యాటకులు తుర్కియే సందర్శించగా, 2025లో ఇది 2.5 లక్షలకు పడిపోయింది. 25 శాతం పర్యాటకులు టూర్‌ రద్దు చేసుకున్నారు. దీంతో టూర్‌ ప్యాకేజీలు, హోటల్స్‌ ఖాళీగా మిగిలాయి. సోషల్‌ మీడియాలో #BoycottTurkey ట్రెండ్‌తో ప్రజలు తమ ఆర్థిక శక్తిని ఆయుధంగా మలిచారు. ఇది టూరిజం ఆదాయాన్ని గణనీయంగా తగ్గించింది.

ఉత్పత్తుల బాయ్‌కాట్‌..
ఇదే సమయంలో భారతీయులు తుర్కీ ఆహార పదార్థాలు, వస్త్రాలు, ఇతర వస్తువులను కూడా నివారించారు. ఇది ఆత్మనిర్భర్‌ భారత్‌ సందేశాన్ని ప్రపంచానికి చేరవేసింది. టర్కీ ఆర్థిక వ్యవస్థకు భారత మార్కెట్‌ కీలకమని ఇప్పుడు స్పష్టమైంది. ఒక్క టూరిజమే కాకుండా, వాణిజ్య రంగాలు కూడా క్షీణిస్తున్నాయి.

ఆర్థిక శక్తి హెచ్చరిక
ఈ బాయ్‌కాట్‌ భారత్‌ ఆర్థిక ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. సైనిక బలం మాత్రమే కాకుండా, ప్రజా కదలికలు, వినియోగ శక్తి ద్వారా దేశం తన హక్కులను కాపాడుకుంటుంది. తుర్కియేకు ఇది పాఠం. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది.

రాజకీయ ఆకర్షణల కోసం ఆర్థిక సంబంధాలను బలవంతంగా మార్చకూడదు. భారత్‌ వంటి ఆర్థిక శక్తిసామర్థ్యం ఉన్న దేశాలతో స్నేహం ప్రయోజనకరం. లేకపోతే, ఇలాంటి బాయ్‌కాట్‌లు మరిన్ని దేశాలకు విస్తరించడం ఖాయం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper