spot_img
Homeబిజినెస్Honda Unicorn: ఈ బైక్ ఇంజిన్, పీచర్లు చూసి యూత్, ఉద్యోగులు పిచ్చెక్కిపోతున్నారు..

Honda Unicorn: ఈ బైక్ ఇంజిన్, పీచర్లు చూసి యూత్, ఉద్యోగులు పిచ్చెక్కిపోతున్నారు..

Honda Unicorn: రోజువారి అవసరాలకు సొంతంగా బైక్ ఉంటేనే బాగుంటుంది. అయితే చాలామంది బడ్జెట్లోనే బైక్ కొనాలని చూస్తారు. మరికొందరు మాత్రం సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్ని బైక్స్ ఎక్కువగా సౌకర్యాలు ఇస్తూ అధిక ధరతో కలిగి ఉంటుంది. వీటి ధర ఎంత ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి బైక్ లను అందించే Honda కంపెనీ Unicorn బైక్ ను ప్రవేశపెట్టింది. ఇది మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి స్థిరమైన డిమాండ్ ను కలిగి ఉంటుంది. అయితే నేటి వినియోగదారులకు అనుగుణంగా ఇంజన్ పనితీరును అప్గ్రేడ్ చేసి యూత్ కు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. ఇది మార్కెట్లోకి వస్తే ఎలా ఉంటుందంటే?

Honda Unicorn కొత్త ఏడాదిలో హైబ్రిడ్ గా రాబోతుంది. దీని డిజైన్ ను పూర్తిగా మార్చేశారు. యూనికాన్ బైక్ ఇంధన ట్యాంక్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు గ్రాఫిక్స్ తో ఆధునికరించారు. ఫ్రంట్ సైడ్ లో DRL తో కూడిన కొత్త LED హెడ్ లాంప్స్ అమర్చారు. సూక్ష్మమైన క్రోమ్ టచ్ తో కూడిన అల్లాయి వీల్స్ బైక్ ను మెరిసే విధంగా చేస్తాయి. దీంతో ఇది యూత్ కు బాగా నచ్చే అవకాశం ఉంది.

కొత్తగా వచ్చే యూనికాన్ హైబ్రిడ్ ఇంజన్ తో రాబోతుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ తో పాటు ఎలక్ట్రిక్ ఇంజన్ ను చేర్చనున్నారు. దీంతో దీనిపై ప్రయాణం చేసేవారు స్మూత్ గా గమ్యాన్ని చేరుతారు. ఈ ఇంజన్ 160 సిసి లో పనిచేస్తుంది. నగరాల్లో దీనిపై వెళ్తే స్టైలిష్ గా కనిపిస్తారు. అంతేకాకుండా ఎక్కువ కాలం పాటు ఇది మన్నికగా ఉండే అవకాశం ఉంది. తక్కువ నిర్వహణ కూడా ఉండడంతో బడ్జెట్లో ఈ బైక్ కొన్నవారికి ఖర్చులు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇంజన్ మైలేజ్ విషయంలో కూడా మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఉంటుంది. లీటర్ ఇంధనానికి 55 నుంచి 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో రోజు వారి వినియోగదారులతో పాటు ఉద్యోగులకు ఈ బైక్ అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఉండే ఎలక్ట్రిక్ అసిస్ట్ ఇంధనాన్ని సేఫ్ చేయడంలో కాపాడుతుంది.

ఈ బైక్ పై రైడర్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని సీటు నిటారుగా ఉండడంతో లాంగ్ డ్రైవ్ చేసినా సమయంలో ఇలాంటి అలసట ఉండదు. ఇందులో సస్పెన్షన్ తో పాటు టెలిస్కోప్ ఫ్రంట్ పోర్క్ ఉండడంతో ఎలాంటి వైబ్రేషన్ గురికాకుండా గతుకుల రోడ్లపై కూడా స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది. స్పీడ్ బ్రేక్ అడ్డుగా వచ్చిన కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లొచ్చు. అలాగే ఈ కొత్త బైక్లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఇంజన్ స్టార్ట్, స్టాప్ సిస్టం, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం, సింగిల్ ఛానల్ ABS, సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ వంటివి బైక్ కు భద్రతలు ఇస్తాయి. ఇది మార్కెట్లోకి వస్తే రూ.1.25 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper