Homeబిజినెస్TATA Electric Scooter: TATA కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

TATA Electric Scooter: TATA కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

TATA Electric Scooter: TATA కంపెనీ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా వాహనాలను అందిస్తూ ఉంటారు. ఇప్పటికే లక్ష రూపాయల కారును అందించిన ఈ కంపెనీ ఇప్పుడు నేటి తరం వినియోగదారులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది.. ప్రస్తుతం మార్కెట్లో ఓలా S1 Pro, Bazaz chetak electric, TVS iQube వంటి స్కూటర్ ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. అయితే వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు టాటా కంపెనీ కొత్తగా […]

TATA Electric Scooter: TATA కంపెనీ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా వాహనాలను అందిస్తూ ఉంటారు. ఇప్పటికే లక్ష రూపాయల కారును అందించిన ఈ కంపెనీ ఇప్పుడు నేటి తరం వినియోగదారులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది.. ప్రస్తుతం మార్కెట్లో ఓలా S1 Pro, Bazaz chetak electric, TVS iQube వంటి స్కూటర్ ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. అయితే వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు టాటా కంపెనీ కొత్తగా ఆకర్షణీయమైన విద్యుత్ వాహనాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ స్కూటర్ విషయంలో రకరకాల అంచనాలు ఉన్నాయి. కానీ ఫైనల్ గా మార్కెట్లోకి రాబోయే స్కూటర్ ఇలా ఉంటుందని అంటున్నారు..

కొత్తగా మార్కెట్లోకి రాబోయే TATA ఎలక్ట్రిక్ స్కూటర్ LED లైట్లతో లేటెస్ట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ డిజిటల్ TFT డిస్ప్లే తో నావిగేషన్, స్పీడ్ వంటివి డిస్ప్లే అవుతాయి. దీనికి ట్యూబ్ లెస్ టైర్లతో పాటు అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉండనున్నాయి. ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రం బ్రేక్ తో రక్షణ ఇవ్వనున్నాయి. విశాలమైన ఫుట్ బోర్డు ఉండడంతో వ్యాపారులకు, ఏదైనా సామాగ్రిని సరఫరా చేసుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. అలాగే కీ లెస్ ఇగ్నిషన్, వాయిస్ నావిగేషన్ ఉండడంతో పాటు బ్లూటూత్ యాప్ సపోర్టు, రైడ్ ట్రాకింగ్, బ్యాటరీ మానిటరింగ్ వంటివి సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే యూఎస్బీ చార్జింగ్ సపోర్ట్, రివర్స్ అసిస్ట్, యాంటీ theft వంటివి రక్షణను ఇస్తాయి.

ఈ వాహనం పూర్తిగా విద్యుత్ వేరియంట్ తో ఉండనుంది. ఇందులో 3.5 kW బ్యాటరీ చేర్చనున్నారు. ఈ బ్యాటరీ 42 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. మీ బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ స్కూటర్ మార్కెట్ లోకి వస్తే రూ.1 లక్ష వరకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇవి కేవలం కొందరు నిపుణులు వేసిన అంచనా మాత్రమే. కంపెనీ నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఇలాంటి ఫీచర్స్ తో మార్కెట్లోకి స్కూటర్ వస్తే రోజువారీ వినియోగదారులకు, వ్యాపారస్తులకు ఇది అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నగరాల్లో స్మూత్ డ్రైవింగ్ చేసే వారితో పాటు అన్ని వర్గాల వారికి ఇది ఉపయోగపడనుంది. అయితే ఈ స్కూటర్ గురించి టాటా కంపెనీ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper