India Turkey Relations : ఆపిల్స్ దిగుమతి రద్దుతోనే భారత్ సరిపెట్టడం లేదు. అంతకుమించి అనే స్థాయిలో భారత్ తుర్కియోకు చుక్కలు చూపిస్తోంది. కనివిని ఎరుగని రేంజ్ లో షాక్ ఇస్తోంది..తుర్కియో దేశానికి చెందిన సెల్బి ఎయిర్ పోర్ట్ సర్వీస్ అనే కంపెనీకి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై ఆ కంపెనీ మనదేశంలోని విమానాశ్రయాలలో సేవలు అందించే అవకాశం లేదు.. ఇక ముంబై విమానాశ్రయంలో ప్రయాణికులకు సంబంధించిన సేవలు, లోడ్ కంట్రోల్, ఫ్లైట్ ఆపరేషన్లు, కార్గో, పోస్టల్ సర్వీసులు, గిడ్డంగులు ఇలా మొత్తం.. 70% కార్యకలాపాలను ఆ కంపెనీ చేపడుతోంది. కేంద్ర విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ కంపెనీ ఉన్నట్టుండి అన్ని కార్యకలాపాల నుంచి వైదొలగాల్సి వచ్చింది.
Also Read : పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్
పర్యాటకపరంగా..
పర్యాటక పరంగా కూడా భారత్ తుర్కియో కు షాక్ ఇస్తోంది.. ఉగ్రవాద దేశానికి చేసిన సాయాన్ని ప్రశ్నిస్తూ మన దేశ పర్యాటకులు తుర్కియో వెళ్లకుండా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు..బ్యాన్ తుర్కియో అంటూ సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ స్ ట్రెండ్ చేస్తున్నారు. “ఉగ్రవాద దేశానికి తుర్కియో సపోర్ట్ చేసింది. అందువల్లే మేము ఈ తరహాలో నిరసన చేపడుతున్నామని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇస్లాం వర్సిటీలు ఒప్పందలు రద్దుచేసుకున్నాయి
తుర్కియోకు కేవలం వ్యాపారపరంగా.. ఇతర వ్యవహారాలపరంగా మాత్రమే కాకుండా.. విద్యకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలను సైతం భారతదేశం రద్దు చేసుకుంటున్నది. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాద దేశానికి తుర్కియోకు అండగా నిలిచిన నేపథ్యంలో.. భారత్లోని అన్ని వర్గాలు తుర్కియోకు ను బాయ్ కాట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను జేఎన్ యూ సంస్థ రద్దు చేసుకుంది. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కూడా అదేదారిలో పయనిస్తోంది. . ఢిల్లీ కేంద్రంగా ఉండే జామియా మిలియా ఇస్లామీయా యూనివర్సిటీ గతంలో తుర్కియోతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేసిన నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామీయా యూనివర్సిటీ ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. ఇక ఈ జాబితాలో ఇప్పుడు ఎంఏఎన్ యూ యూనివర్సిటీ కూడా చేరింది. హైదరాబాదులోని ఈ యూనివర్సిటీ తుర్కియో లోని విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే వాటిని ఇప్పుడు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అటు వ్యాపారపరంగా.. పర్యాటకపరంగా ఇప్పటికే భారత్ తుర్కియోకు కోలుకోలేని షాక్ లు ఇచ్చింది. ఇప్పుడు విద్యాపరంగా కూడా షాక్ ఇచ్చి కోలుకోలేకుండా చేస్తోంది. దీనిపై ఇంతవరకు తుర్కియో స్పందించలేదు. కాగా, ఇప్పటికే టూరిజం పరంగా భారత్ తన ఆలోచన మార్చుకోవాలని తుర్కియో నుంచి ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది.