Homeజాతీయం - అంతర్జాతీయంPannun plot: పన్నూ ఫినిష్‌కు స్కెచ్‌.. బెడిసి కొట్టడంతో అమెరికా జైల్లో భారతీయుడు!

Pannun plot: పన్నూ ఫినిష్‌కు స్కెచ్‌.. బెడిసి కొట్టడంతో అమెరికా జైల్లో భారతీయుడు!

Pannun plot: ఖలిస్థానీ నేత.. వేర్పాటువాది.. హత్య కేసులో మొన్నటి వరకు కెనడాలో పెద్ద వివాదం నడిచింది. భారత్‌ ఖలిస్థానీని హతమార్చాడని ఆరోపించింది. దీనిపై పెద్ద రచ్చ చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. తాజాగా అమెరికాలో ఖలిస్థానీ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ హత్యకు ఓ భారతీయుడు స్కెచ్‌ వేశాడు. కానీ అది బెడిసి కొట్టింది. దీంతో ఇప్పుడు అమెరికా జైల్లో మగ్గుతున్నాడు. చివరకు మాన్హాటన్‌ ఫెడరల్‌ కోర్టులో జడ్జి ముందు నేరాన్ని […]

Pannun plot: ఖలిస్థానీ నేత.. వేర్పాటువాది.. హత్య కేసులో మొన్నటి వరకు కెనడాలో పెద్ద వివాదం నడిచింది. భారత్‌ ఖలిస్థానీని హతమార్చాడని ఆరోపించింది. దీనిపై పెద్ద రచ్చ చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. తాజాగా అమెరికాలో ఖలిస్థానీ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ హత్యకు ఓ భారతీయుడు స్కెచ్‌ వేశాడు. కానీ అది బెడిసి కొట్టింది. దీంతో ఇప్పుడు అమెరికా జైల్లో మగ్గుతున్నాడు. చివరకు మాన్హాటన్‌ ఫెడరల్‌ కోర్టులో జడ్జి ముందు నేరాన్ని అంగీకరించాడు.

కుట్ర భగ్నం..
అమెరికా గడ్డపై కుట్ర భగ్నం చేసినట్లు గతంలో అటార్నీ కార్యాలయం ప్రకటించింది. చెక్‌ రిపబ్లిక్‌లో గుప్తాను అరెస్టు చేసి అమెరికాకు అప్పగించారు. భారత అధికారి సంబంధం ఆరోపణలు చేశారు, కేంద్రం ఖండించి అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది.

అసలేం జరిగింది..?
భారతీయుడు నిఖిల్‌ గుప్తా కిరాయికి హత్యాకాండం, కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పంచాడని అమెరికా అటార్నీ కార్యాలయం ప్రకటించింది. గురువారం జడ్జి సారా నెట్బర్న్‌ ముందు నేరం అంగీకరించాడు? దీంతో మే 29న శిక్ష విధించనున్నట్లు కోర్టు ప్రకటించింది. 40 ఏళ్లకుపైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే దీనిపై గుప్తా న్యాయవాదులు ఇంకా స్పందించలేదు. భారత ప్రభుత్వం కూడా అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు. ఈ సంఘటన భారత–అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త చర్చలకు దారితీసింది.

నిఖిల్‌ గుప్తా నేరం అంగీకరించినా భారత అధికారి ఆరోపణలు ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉంది. ఇది రహస్య కార్యకలాపాలపై అంతర్జాతీయ చర్చలను రేకెత్తించనుంది. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినకుండా చూడడం కీలకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper