Homeజాతీయం - అంతర్జాతీయంIndia beats USA economy growth: అమెరికాను బీట్ చేసిన భారత్.. అగ్రరాజ్యానికి షాక్

India beats USA economy growth: అమెరికాను బీట్ చేసిన భారత్.. అగ్రరాజ్యానికి షాక్

India beats USA economy growth: ప్రపంచంలో సంపన్న దేశం అమెరికా. అభివృద్ధిలోనూ అగ్రస్థానమే. తర్వాతి స్థానంలో చైనా ఉంది. అమెరికాతో పోటీ పడుతోంది. ఇక భారత్‌ కూడా గడిచిన పదేళ్లలో మెరుగైన అభివృద్ధి సాధించింది. అయితే తాజాగా అభివృద్ధి రేటులో భారత్‌ అమెరికాను మించిపోయింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) 2026 ఆర్థిక అంచనాలను సవరించి, భారత్‌ గ్లోబల్‌ వృద్ధిలో 17% వాటా ఉందని తెలిపింది. ప్రపంచ మాంద్యం నేపథ్యంలో భారత మెరుగైన వృద్ధి సాధిచడం గమనార్హం. […]

India beats USA economy growth: ప్రపంచంలో సంపన్న దేశం అమెరికా. అభివృద్ధిలోనూ అగ్రస్థానమే. తర్వాతి స్థానంలో చైనా ఉంది. అమెరికాతో పోటీ పడుతోంది. ఇక భారత్‌ కూడా గడిచిన పదేళ్లలో మెరుగైన అభివృద్ధి సాధించింది. అయితే తాజాగా అభివృద్ధి రేటులో భారత్‌ అమెరికాను మించిపోయింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) 2026 ఆర్థిక అంచనాలను సవరించి, భారత్‌ గ్లోబల్‌ వృద్ధిలో 17% వాటా ఉందని తెలిపింది. ప్రపంచ మాంద్యం నేపథ్యంలో భారత మెరుగైన వృద్ధి సాధిచడం గమనార్హం.

మూడు వారాల్లో గణనీయ పురోగతి
గత మూడు వారాల్లో భారత వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. తయారీ రంగం, మౌలిక పెట్టుబడులు ప్రధాన కారణాలు. ప్రపంచ వాణిజ్యం కుంగిపోతుంటే భారత వ్యవస్థ దృఢంగా నిలిపింది. గ్లోబల్‌ వృద్ధిలో అమెరికా వాటా కేవలం 9.9%కి పరిమితమైంది. చైనా 26.6%తో అగ్రస్థానంలో ఉంది. భారత వేగం ఆసియా దేశాల్లో ప్రధానం.

సూపర్‌ పవర్‌గా చైనా, భారత్‌..
ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో భారత పాత్ర పెరుగుతోంది. జనాభా శక్తి, ఇన్‌ఫ్రా అభివృద్ధి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. 2026లో ఈ ట్రెండ్‌ గ్లోబల్‌ ఆధిపత్యానికి దారితీస్తుంది. గ్లోబల్‌ వృద్ధిలో భారత్, చైనా కలిపి 43.6 శాతం ఉంది. ఆసియా పసిఫిక్‌ దేశాల వాటా 50 శాతం దాటుతుంది. టాప్‌ టెన్‌ జాబితాలో భారత్, చైనాతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇండోనేషియా, తుర్కియే, వియత్నాం, సౌదీ అరేబియా కాంట్రిబ్యూట్‌ చేస్తున్నాయి.

నిపుణుల కీలక వ్యాఖ్యలు..
తాజా పరిస్థితులపై ప్రపంచకుబేరుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పవర్‌ బ్యాలెన్స్‌ మారుతుందని పేర్కొన్నారు. గ్లోబల్‌ గ్రోత్‌ను పాశ్చాత్య దేశాలు మాత్రమే ప్రభావితం చేయలేవని నిపుణులు అంటున్నారు. పవర్‌ బ్యాలెన్స్‌ షిఫ్ట్‌ చేయడంలో భారత్‌ కీలకంగా మారుతోందని పేర్కొంటున్నారు.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper