India US trade : ఏడాదికాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లతో ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. మాట నికున్నా.. రూల్స్ అధిగమించినా.. మిత్రుడు, శత్రువు అని తేడా లేకుండా అన్నిదేశాలపై టారిఫ్‌లు విధిస్తూ వచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే టారిఫ్.. ట్రంప్ చేతిలో రాయిలా మారింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మొదలైంది. దీంతో అమెరికాకు లాభం ఏమోగాని, అక్కడి ప్రజలు ధరలు పెగిరి.. ఇంటి బడ్జెట్ పూర్తిగా మారిపోయింది. అయితే అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేసింది. తాజా సుప్రీం తీర్పుతో ప్రపంచ దేశాలు పండుగ చేసుకుంటున్నాయి. కానీ ట్రంప్ ఫ్రంస్ట్రేషన్‌తో ఊగిపోతున్నారు. మరో రూపంలో పన్నులు విధించే ప్లాన్ చేస్తున్నారు.
ట్రంప్ టారిఫ్స్‌కు ఎదురు దెబ్బ
కోర్టు 6–3 ఆమోదంతో ట్రంప్ అత్యవసర చట్టం ద్వారా విధించిన విస్తృత సుంకాలను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. దీంతో భారత్‌తో అమెరికా చేసుకున్న మధ్యంతర డీల్‌లో విధించిన 18 శాతం టారిఫ్ చట్టబద్ధత కోల్పోయింది. దీంతో ఎంఎఫ్‌ఎన్ స్థితి ప్రకారం 3.5%కి పడిపోయే అవకాశం కనిపించింది, కానీ ట్రంప్ తక్షణం సెక్షన్ 122 ఉపయోగించి 10% ప్రపంచవ్యాప్త టారిఫ్ విధించారు.
భారత్‌కు కలిగే ప్రయోజనాలు..
భారత్‌పై అమలులో ఉన్న 18 శాతం టారిఫ్‌లు ఇప్పుడు 10 శాతానికి పడిపోయింది. 13 శాతం తగ్గడం టెక్స్‌టైల్స్, ఫార్మా, మెషినరీ వర్గాలకు లాభదాయకం. రష్యన్ ఆయిల్ ఎగుమతులపై అదనపు డ్యూటీ తొలగడం వల్ల భారత్‌పై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 150 రోజులు మాత్రమే ఈ టారిఫ్, తర్వాత కాంగ్రెస్ ఆమోదం అవసరం.
ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాలు
సుప్రీంకోర్టు తీర్పును డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. కొత్త చట్టాలు (ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్) ద్వారా టారిఫ్స్‌ను బలోపేతం చేయాలని సూచించారు. భారత్‌తో మార్చి చివరలో సంతకం కానున్న డీల్‌లో మార్పులు రావచ్చు. ఇది అతని ’అమెరికా ఫస్ట్’ లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం.
టారిఫ్ తగ్గింపుతో భారత ఎగుమతులు 10 నుంచి 15 బిలియన్ డాలర్లు పెరిగే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ఆమోదం లేకపోతే టారిఫ్స్ మళ్లీ పెరిగే ప్రమాదం. భారత్ ఈ అవకాశాన్ని స్థానిక పరిశ్రమల బలోపేతానికి ఉపయోగించుకోవాలి. మొత్తంగా, ఈ మలుపు భారత వాణిజ్యానికి తాత్కాలిక బూస్ట్.