Sivakasi Fireworks Industry: దీపావళి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా బాణసంచా వెలుగులు విరజిమ్ముతుంటాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చుతారు. పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఈ బాణాసంచా వెనక వేలాదిమంది కార్మికుల శ్రమ ఉంటుంది. చెమట ఉంటుంది. మనదేశంలో బాణసంచా తయారీకి ఒక ప్రాంతం ప్రత్యేకం. ఆ ప్రాంతం పేరు శివకాశి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం. ఇక్కడ తయారయ్యే టపాసులు దేశంలోని అనేక ప్రాంతాలకు రవాణా అవుతుంటాయి. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అయితే ఈ స్థాయిలో వ్యాపారం జరుగుతున్నప్పటికీ ఇక్కడ పని చేసే కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
తమిళనాడు రాష్ట్రంలోని విరుద్ నగర్ జిల్లాలోని శివకాశి పట్టణం ఉంది. దీనిని భారత దేశపు బాణసంచా రాజధానిగా చెబుతుంటారు. మనదేశంలో ఉపయోగించే బాణ సంచాలో సుమారు 90 శాతం వరకు ఇక్కడే తయారవుతుంది. 2026 అక్టోబర్లో వెలువడిన నివేదిక ప్రకారం శివకాశి పరిసర ప్రాంతాలలో 1070 కి పైగా లైసెన్స్ పొందిన బాణాసంచా తయారీ యూనిట్లు ఉన్నాయి. వీటి వార్షిక టర్నోవర్ సుమారు 7వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ పరిశ్రమల ద్వారా సుమారు మూడు లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. మరో ఐదు లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కేవలం బాణాసంచా తయారీ మాత్రమే కాకుండా.. ముడిసరుకు సరఫరా.. ప్యాకింగ్.. రవాణా.. హోల్ సేల్.. రిటైల్ వ్యాపారుల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.
శివకాశి ప్రాంతంలో పనిచేసే కార్మికులలో అధికంగా మహిళలు ఉంటారు. టపాసుల తయారీకి సంబంధించి అనేక దశల్లో మహిళలు పనిచేస్తుంటారు. అయితే వీరికి ఉద్యోగం అంత ఈజీ కాదు. పేలుడు పదార్థాలకు సంబంధించిన ముడి సరుకుతో పని చేయాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు జరిగిన భారీగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని యూనిట్లలో కార్మికులకు చేసే పని ఆధారంగా కూలి చెల్లిస్తుంటారు. అందువల్లే కార్మికులు రేయింబవళ్లూ పనిచేస్తారు. భారీగా సంపాదించాలి అనే ఉద్దేశంతో మహిళలు వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం వల్ల అతివలు పని ఎక్కువగా చేస్తుంటారు. కార్మికులకు తగినంత సెక్యూరిటీ పరికరాలు.. ట్రైనింగ్.. హెల్త్ ప్రొటెక్షన్ వంటి సదుపాయాలు ఇక్కడ అంతంతమాత్రంగానే ఉంటాయి.
బాణ సంచా తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు.. పేలుళ్లు జరుగుతుంటాయి. ముడి సరుకు నిల్వ.. తయారు చేసే విధానం.. కార్మికుల భద్రత వంటివి అనేక సమస్యలు ఎక్కడ ఉన్నాయి. ముఖ్యంగా అనుమతికి నుంచి కార్మికులను కంపెనీలు నియమిచ్చుకుంటాయి. శిక్షణ ఇవ్వకపోవడం.. భద్రతను పట్టించుకోకపోవడం వంటి అంశాలు ప్రమాదాల తీవ్రతను విపరీతంగా పెంచుతున్నాయి. 2024లో శివకాశి పరిసర ప్రాంతంలో జరిగిన 17 ప్రమాదాలలో 54 మంది చనిపోయారు. ఇక్కడ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత ఉండదని.. తక్కువ వేతనాలు ఉంటాయని తెలుస్తోంది.
ఇక ఈ ప్రాంతంలో బాణాసంచా తయారీ పరిశ్రమలలో పనిచేసే వారికి ఏడాది మొత్తం ఒకే స్థాయిలో వేతనం ఉండదు. దీపావళి దగ్గరికి వస్తున్న సమయంలో ఉత్పత్తి పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆర్డర్లు రావడం వల్ల ఫ్యాక్టరీలో పనులు వేగం పుంజు కుంటాయి. మిగతా సమయంలో డిమాండ్ తగ్గుతుంది. 2026 సెప్టెంబర్ లో కొన్ని తయారీ యూనిట్లలో కార్మికుల కొరత.. నిబంధనల వల్ల ఉత్పత్తి తగ్గింది. పని తగ్గిపోవడంతో కార్మికుల ఆదాయం.. కుటుంబ ఖర్చులు.. పిల్లల చదువుల మీద తీవ్రమైన ప్రభావం పడింది. ఒకవేళ వర్షం కురిసినా ఉత్పత్తి మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీంతో ఈ పరిశ్రమలో పనిచేసే అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి