Idupu Kagitam: ప్రియదర్శి , నగదుర్గా హీరో హీరోయిన్లు గా ‘ఇడుపు కాగితం’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తుండగా, డైరెక్టర్ సుకుమార్ కథ ని అందించాడు. టైటిల్ ప్రకటన నుండే సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం , కచ్చితంగా కమర్షియల్ గా వండర్స్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ట్రేడ్ లో ఉంది. పైగా ఈమధ్య తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన చిన్న డ్యాన్స్ బీట్ కి సంబంధించిన వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో లో హీరోయిన్ నాగదుర్గ డ్యాన్స్ వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి.
ఇంతకాలం ఫోక్ సాంగ్స్ తో ఆడియన్స్ ని అలరించిన నాగదుర్గ లో ఈ రేంజ్ మాస్ యాంగిల్ ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చిన నాగదుర్గ , తన అత్తా మామలను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా డ్యాన్స్ చేయడం , చివర్లో ప్రియదర్శి కూడా ఆమెతో కలిసి చిందులు వేయడం ఈ ప్రోమో లో స్పెషల్ హైలైట్స్ గా నిలిచాయి. చూస్తుంటే సోషల్ మీడియా ద్వారా మంచి ఫేమ్ ని సంపాదించి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యే రెండో హీరోయిన్ గా నాగదుర్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. గతం లో వైష్ణవి చైతన్య కూడా ఇలాగే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ , కవర్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన వైష్ణవి చైతన్య , బేబీ చిత్రం తో కుంభస్థలం బద్దలు కొట్టింది. రాబోయే రోజుల్లో నాగదుర్గ కూడా ఆ రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఈ ఒక్క ప్రోమో ని చూసి చెప్పొచ్చు.