spot_img
HomeజాతీయంAyodhya Ram Mandir: అయోధ్యకు రాముడొచ్చాడు.. మోడీ ఏమోషనల్‌ వర్డ్స్‌ వైరల్‌

Ayodhya Ram Mandir: అయోధ్యకు రాముడొచ్చాడు.. మోడీ ఏమోషనల్‌ వర్డ్స్‌ వైరల్‌

Ayodhya Ram Mandir: ‘అయోధ్యలో దివ్య రామ మందిరంలో భవ్య రాముడు కొలువుదీరాడు. ఎన్నో త్యాగాలు, బలిదానాల తర్వాత మన శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నారు. దశాబ్దాల భారతీయుల కల నెరవేరింది. రామ భక్తులందరికీ నా శుభాకాంక్షలు. బాల రాముడి ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడం నా అదృష్టం. 2024, జనవరి 22 కొత్త కాలచక్రానికి ప్రతీక. ఇది విగ్రహ ప్రతిష్ట కాదు.. మన దేశ గౌరవం. రాముడు ఉన్నచోట హనుమంతుడు ఉంటాడు’ అని ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో ఎమోషనల్‌ ప్రసంగం చేశారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభించిన ఆనందం మోదీ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది.

అభిజిత్‌ లగ్నంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట.
భారతీయుల ఐదు శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో మేషలగ్నం, అభిషత్‌ ముహూర్తంలో జనవరి 22(సోమవారం) మధ్యాహ్నం 12:32:29 సెకన్లక బాల రాముడు కొలువుదీరాడు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్‌ లల్లాకు ప్రాణ ప్రతిష్ట జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట గావించారు. అంతకు ముందు రామ్‌ లల్లాకు మోదీ పట్టు వస్త్రాలు, వెండి ఛత్రి తీసుకుని వచ్చారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన బాల రాముడిని, అపురూప దివ్య స్వరూపాన్ని ఆవిష్కరించారు. రామ్‌ లల్లా దివ్య స్వరూపాన్ని తిలకించి యావద్‌ దేశం పులకించిపోయింది. నీలి కళ్ల రాముడు.. బంగారు ఆభరణాలతో అలంకారితుడై దర్శనమిచ్చాడు. 84 సెకన్లలో రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష్ట పూర్తి చేశారు.

పూజలో ప్రముఖులు
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పూజలు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. బాల రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ట అనంతరం బాల రాముడికి ప్రధాని మోదీ 108 హారతులతో హారతి ఇచ్చారు. అర్చన చేశారు. నైవేద్యాలు సమర్పించారు. తాను తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు, వెండి ఛత్రిని కూడా బాల రాముడికి సమర్పించారు.

మోదీ భావోద్వేగ ప్రసంగం
రామాలయంలో పూజా కార్యక్రమాల అనంతరం నరేంద్రమోదీ ఆలయ ప్రాంగణంలో ఉన్న అతిథులను, సాధువులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైందన్నాడు. మన రాముడు అయోధ్యకు వచ్చాడని తెలిపారు. ఇక బాల రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. రామ మందిర నిర్మాణం పూర్తయిందని, ఇక దేశ నిర్మాణంపై దృష్టిపెడతామన్నారు. మోదీ స్వయంగా జై శ్రీరామ్‌ అంటు నినదించారు. అయోధ్యలో అపూర్వ ఘట్టంలో తాను భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

38 వేల కిలోల పూల వర్షం..
ఇదిలా ఉండగా బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు ముందు అయోధ్య రామాలయంపై హెలిక్యాప్టర్లతో పూల వర్షం కురిపించారు. 38 వేల కిలోల పూలను ఇందుకోసం వినియోగించారు. మరోవైపు అయోధ్య రామాలయ అలంకరణకూ టన్నుల కొద్దీ పూలను వినియోగించారు.

50 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం..
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని 50 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దాదాపు గంటపాటు అపురూప ఘట్టాన్ని హిందువులు వీక్షించారు. న్యూయార్క్‌ టైమ్స్‌ స్వేర్‌పైనా బాల రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper