spot_img
HomeజాతీయంDoctor Gaurav Gandhi : 16 వేల గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్‌.. గుండెపోటుతో మృతి

Doctor Gaurav Gandhi : 16 వేల గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్‌.. గుండెపోటుతో మృతి

Doctor Gaurav Gandhi : అతనో గుండె వ్యాధి డాక్టర్‌.. ఎన్నో క్లిష్టమైన కేసులను ప్రత్యక్షంగా చూశారు. 16 వేల మంది గుండెకు ఆపరేషన్‌ చేశారు. ఇతర వైద్యుల కాదన్న కేసులను కూడా ఆయన టేకప్‌ చేసి ప్రాణాలు నిలబెట్టారు. రిస్క్‌ అని తెలిసి కూడా సర్జరీలు చేసిన కేసులెన్నో.. గుండె వ్యాధులపై పూర్తి అవగాహన ఉన్న ఆ డాక్టర్‌ను అదె గుండోపోటు బలి తీసుకుంది.

దేశవ్యాప్తంగా గుర్తింపు..
అతని పేరు డాక్టర్‌ గౌరవ్‌ గాంధీ. రాష్ట్రం గుజరాత్‌. నివాసం జామ్‌ నగర్‌. 41 ఏళ్ల గౌరవ్‌ గాంధీ ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా పేరు పొందారు. ఇప్పటి వరకు 16 వేల గుండె ఆపరేషన్లు చేశారు. జామ్‌ నగర్‌ మొత్తం తెలుసు డాక్టర్‌ గౌరవ్‌ అంటే. హస్తవాసి బాగుంటుందని.. వెయిట్‌ చేసి మరీ గౌరవ్‌ తోనే ఆపరేషన్లు చేయించుకునే వారు పేషెంట్లు.. దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియా వేదికగా చేపట్టిన గుండె వ్యాధుల నిరవారణ ఉద్యమంలోనూ గౌరవ్‌ కీలకపాత్ర పోషించారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

రోజులాగానే విధులు..
జూన్‌ 6వ తేదీ రాత్రి వరకు ఆస్పత్రిలో పేషెంట్లను చూసి.. జామ్‌ నగర్‌ ప్యాలెస్‌ రోడ్డులోని తన ఇంటికి వచ్చారు. రోజు మాదిరిగానే డిన్నర్‌ చేసి రాత్రి 11 గంటల సమయంలో నిద్ర పోయారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు లేచి వాకింగ్‌ కు వెళ్లే డాక్టర్‌ గౌరవ్‌.. 2023, జూన్‌ 7వ తేదీ బుధవారం ఉదయం నిద్ర లేవలేదు. బయట వర్షం పడుతుండటంతో.. నిద్ర లేవలేదని భావించిన కుటుంబ సభ్యులు.. అతన్ని డిస్ట్రబ్‌ చేయలేదు. 7 గంటల తర్వాత కూడా నిద్ర లేవకపోవటంతో.. ఇంట్లోని కుటుంబ సభ్యులు నిద్ర లేపారు. ఉలుకూ పలుకూ లేకపోవటంతో.. భయమేసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.

కార్డియాక్‌ అరెస్ట్‌తో..
41 ఏళ్ల డాక్టర్‌ గౌరవ్‌.. నిద్రలోనే తీవ్ర గుండెపోటు.. కార్డియాక్‌ అరెస్ట్‌ తో చనిపోయినట్లు చెబుతున్నారు డాక్టర్లు. కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రి పడుకునే మందు అందరితో మాట్లాడాడని.. ఎలాంటి అనారోగ్యం అని చెప్పలేదని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

16 వేల గుండెలు డాక్టర్‌ గౌరవ్‌ చలవతోనే ప్రసుత్తం కొట్టుకుంటున్నాయి. 41 ఏళ్ల వయసులోనే ఆయన 16 వేల గుండె ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. ఆ డాక్టర్‌ ఇక లేరన్న విషయం తెలిసి జామ్‌నగర్‌లోని డాక్టర్లతోపాటు.. ప్రజలు షాక్‌ అయ్యారు. దేశంలోనే అతి చిన్న వయస్సులోనే ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా పేరు పొందిన గౌరవ్‌.. అదే గుండెపోటుతో చనిపోవటం డాక్టర్ల ప్రపంచాన్ని షాక్‌ కు గురి చేసింది. ఇలాంటి ప్రముఖ కార్డియాలజిస్టులే గుండెపోటుతో చనిపోతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper