Homeజాతీయ వార్తలుIndian Railways: రైళ్లల్లో ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా.. ఈ విషయం మీకు తెలుసా..

Indian Railways: రైళ్లల్లో ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా.. ఈ విషయం మీకు తెలుసా..

Indian Railways: రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికుల మొబైల్ బ్యాటరీ అయిపోతే తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే వారికి ఫోన్ చార్జింగ్ అనేది అత్యంత అవసరం. టికెట్ వివరాలు చూసుకోవడం.. కుటుంబ సభ్యులతో మాట్లాడటం.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఇతర ఏర్పాటు చూసుకోవడం వంటి పనులకు ఫోన్ అనేది అత్యంత అవసరం. అయితే ట్రైన్ లో మొబైల్ ఛార్జింగ్ విషయంలో ఇండియన్ రైల్వే ఇప్పుడు సరికొత్త నిబంధన అందుబాటులో తీసుకొచ్చింది. ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ […]

Indian Railways: రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికుల మొబైల్ బ్యాటరీ అయిపోతే తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే వారికి ఫోన్ చార్జింగ్ అనేది అత్యంత అవసరం. టికెట్ వివరాలు చూసుకోవడం.. కుటుంబ సభ్యులతో మాట్లాడటం.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఇతర ఏర్పాటు చూసుకోవడం వంటి పనులకు ఫోన్ అనేది అత్యంత అవసరం. అయితే ట్రైన్ లో మొబైల్ ఛార్జింగ్ విషయంలో ఇండియన్ రైల్వే ఇప్పుడు సరికొత్త నిబంధన అందుబాటులో తీసుకొచ్చింది.

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన నిబంధన ప్రకారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రైళ్లల్లో మొబైల్ ఫోన్.. లాప్టాప్ చార్జింగ్ పాయింట్లను నిలిపివేయబోతోంది. ఈ నిబంధన కష్టంగా అమలు చేయాలని రైల్వే శాఖ అన్ని జోన్లకు మరోసారి స్పష్టం చేసింది.. దీని వెనక ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే రైళ్లల్లో పవర్ పేలుడు ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తెరమీదకి తీసుకొచ్చింది.

అక్టోబర్ 26న రైల్వే బోర్డు ఒక లేఖ జారీ చేసింది. దీని ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు చార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా నిలుపుదల చేయాలని అందులో స్పష్టం చేసింది. ఈ ఆరు గంటల సమయంలో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే రైల్వే సిబ్బందికి తగిన శిక్ష విధించాలని.. అధికారులు.. సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు జరపాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల దక్షిణ తూర్పు రైల్వే జోన్ పరిధిలో ఒక ప్రయాణికునికి సంబంధించిన పవర్ బ్యాంకు ఛార్జింగ్ లో ఉండగా పేలిపోయింది. ఆ సమయంలో దట్టంగా పొగ వెలబడింది. ఈ క్రమంలో ట్రైన్ లో చార్జింగ్ పాయింట్లను పూర్తిగా నిలిపివేయాల్సి ఉండగా.. సిబ్బంది అలా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

రాత్రిపూట చార్జింగ్ పాయింట్లను నిలుపుదల చేయాలి అనే నిర్ణయం ఇప్పటిది కాదు. 2013లో హాజూర్ సాహిబ్ నాందేడ్ కె ఎస్ ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ ఏసీ త్రీ టైర్ కోచ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కమిషనర్ విచారణ చేశారు. నాడు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ఏసీ కోచ్లలో మొబైల్ ఫోన్లు.. లాప్టాప్ చార్జింగ్ పాయింట్లను రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేయాలని సూచించారు. అయితే రైల్వే బోర్డు ప్రయాణికుల భద్రత.. ఇతర సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని 2014 జూన్ లో రాత్రి 11 నుంచి ఉదయం ఐదు గంటల వరకు చార్జింగ్ పాయింట్లను నిలుపుదల చేయాలని సూచించింది.

రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఏసీ కోచ్ లలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడం సులభం. కానీ నాన్ ఎసి.. స్లీపర్ క్లాస్ కోచ్ లలో అదేవిధంగా అమలు చేయడానికి సిబ్బంది అవసరమవుతారు. 2023 నవంబర్లో న్యూఢిల్లీ దర్భంగా హమ్ సఫర్ క్లోన్ స్పెషల్ రైల్లో స్లీపర్ కోచ్ కు సంబంధించి అగ్నిప్రమాదం జరిగిన తర్వాత.. స్లీపర్ కోచ్లలో కూడా చార్జింగ్ పాయింట్లను నిలిపివేయాలని అధికారులు సూచించారు. అయితే నాన్ ఏసీ కోచ్లలో ఈ విధానాన్ని అమలు చేయడానికి సిబ్బంది అధికంగా అవసరం పడతారు. ఈ విషయాన్ని గతంలో రైల్వే బోర్డు వెల్లడించింది. అందువల్ల ఏసి కోచ్లలో మాత్రమే తాజా నిర్ణయాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది.

రైల్వే బోర్డు తీసుకొని నిర్ణయం నేపథ్యంలో రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు కొన్ని విషయాలను ముందుగానే గుర్తుంచుకోవాలి. రాత్రి 11 గంటలపై మొబైల్ ఫోన్ పూర్తిగా చార్జింగ్ చేసుకోవాలి. అవసరమైతే పవర్ బ్యాంకు ను వెంట ఉంచుకోవాలి. మొబైల్ బ్యాటరీ లో సేవర్ మోడ్ ఆన్ చేయాలి. టికెట్ వివరాలు.. ముఖ్యమైన ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచుకోవాలి. పాడైన చార్జింగ్ కేబుల్ లేదా నాణ్యతలేని అడాప్టర్లను ఉపయోగించకూడదు. చార్జింగ్ సమయంలో ఫోన్ లేదా పవర్ బ్యాంకు వేడెక్కడం.. పొగరు రావడం అంటే లక్షణాలు కనిపిస్తే వెంటనే చార్జింగ్ నిలిపివేసి.. రైల్వే సిబ్బందికి సమాచారం అందించాలి.

చాలామంది ప్రయాణికులకు రైల్వే బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయం ద్వారా ఒక సందేహం వస్తోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫోన్ చార్జింగ్ పాయింట్లను మాత్రమే నిలిపివేస్తారు. అంతేగాని మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదనేది రైల్వే శాఖ ఉద్దేశం కాదు. ప్రయాణికులు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంటర్నెట్ ఉపయోగించవచ్చు. అయితే బ్యాటరీ పూర్తిగా నిండుకోకుండా ముందుగానే జాగ్రత్తలు వహించాలి..

ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్నబాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. ముఖ్యంగా ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో చార్జింగ్ లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు వేడెక్కినా.. వాటిలో లోపాలు బయటపడినా.. వెంటనే గుర్తించడం కష్టం. అందుకే రైల్వే శాఖ రాత్రి పూట చార్జింగ్ పాయింట్లను నిలిపివేసే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని భావిస్తుంది. కాబట్టి రాత్రిపూట రైలు ప్రయాణం చేసేవారు ఈ నిబంధనలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తెల్లవారుజామున గమన స్థానానికి చేరుకునేవారు తమ ఫోన్ బ్యాటరీ విషయంలో ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper