Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: యలహంక ప్రాపర్టీ.. జగన్ నైజాన్ని ట్వీట్ తో బయటపెట్టిన షర్మిల

YS Sharmila: యలహంక ప్రాపర్టీ.. జగన్ నైజాన్ని ట్వీట్ తో బయటపెట్టిన షర్మిల

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మొత్తానికి కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న యలహంక ప్రాపర్టీ విషయం మీద మొత్తానికి నోరు విప్పారు. తన కుమార్తె వివాహాన్ని ఇక్కడ జరపాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహ ఆహ్వాన పత్రికలో వివాహ వేదిక పేరును యలహంకగా ప్రస్తావించారు. వివాహ ఆహ్వాన పత్రికలను అందరికీ పంచారు కూడా. అయితే ఇక్కడ వివాహం జరిపితే తన తన భద్రతకు ముప్పు ఉంటుందని.. ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని జగన్ […]

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మొత్తానికి కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న యలహంక ప్రాపర్టీ విషయం మీద మొత్తానికి నోరు విప్పారు. తన కుమార్తె వివాహాన్ని ఇక్కడ జరపాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహ ఆహ్వాన పత్రికలో వివాహ వేదిక పేరును యలహంకగా ప్రస్తావించారు. వివాహ ఆహ్వాన పత్రికలను అందరికీ పంచారు కూడా.

అయితే ఇక్కడ వివాహం జరిపితే తన తన భద్రతకు ముప్పు ఉంటుందని.. ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని జగన్ సరికొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు తన సోదరి షర్మిలకు లేఖ ద్వారా తెలియజేశారు. జగన్ కు ఈ విషయంలో చెప్పి చూసేందుకు బంధువులు ప్రయత్నించినప్పటికీ ఆయన వినిపించుకోలేదని సమాచారం. ఇదే సమయంలో షర్మిల తరఫు బంధువులు ఆమెకు అండగా నిలిచారు.

ఈ వ్యవహారం మీద తొలిసారిగా షర్మిల నోరు విప్పారు.. తనకు సంబంధించిన ఆస్తికోసం మాత్రమే పోరాడతానని.. తన అధికాని దానికోసం ఆశపడే నీచ బుద్ధి తనకు లేదని పేర్కొన్నారు.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ నాకు 100%.. నా పిల్లలకు వచ్చిందని.. దేవుడి సాక్షిగా ఇది నిజమని.. వైయస్సార్ తిరిగిన ఇల్లు కనుక కూతురు అంజలి కోరిక మేరకు పెళ్లి అక్కడే చేయాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఆకాంక్షను నెరవేర్చలేక పోతున్నామని బాధపడుతున్నాం.. పెళ్లి వేరే ప్రదేశంలో నిర్వహించాలని నిర్ణయించామని” షర్మిల పేర్కొన్నారు.

షర్మిలకు.. జగన్ కు ఇక్కడి ప్యాలెస్ లో స్థలాలను విభజించారు. ఎవరివి వారి వే అన్నట్టుగా నాడు వైఎస్ బతికి ఉన్నప్పుడు నిర్మించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే షర్మిల గృహప్రవేశానికి వైయస్ హాజరయ్యారు.. గృహాలు ఎవరివి వారివే ఉన్నప్పటికీ ఇక్కడ పెళ్లి జరపడానికి వీలులేదని జగన్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో షర్మిల తన కుమార్తె వివాహాన్ని వేరే వేదిక వద్ద జరపాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి మేనకోడలి పెళ్లి విషయంలో మేనమామ ముందుండాలి అంటారు. కానీ ఈ విషయంలో జగన్ పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. ఫలితంగా షర్మిల తన బాధను ట్వీట్ రూపంలో బయటపెట్టారు.. షర్మిల ఆవేదనను చాలామంది అర్థం చేసుకున్నారు. జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. మేనకోడలి పెళ్లికి జగన్ సహకరించి ఉంటే బాగుండేదని షర్మిళ వర్గీయులు చెబుతున్నారు. వైఎస్ ఒకవేళ బతికి ఉంటే వివాదం ఉండేది కాదని, తన కుమార్తె వివాహాన్ని షర్మిళ అంగరంగవైభవంగా జరుపుకునేవారని ఆమె శ్రేయోభిలాషులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper