Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ.. త్వరగా చూసేయండి..

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ.. త్వరగా చూసేయండి..

Vijayasai Reddy: శీర్షిక చదివారు కదా.. ఇదేమైనా సినిమానా.. చూసేయడానికి అనే అనుమానం మీలో కలుగుతుంది కదా. ఇప్పటికే రెండుసార్లు విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం పెట్టారు. తన పార్టీకి సంబంధించి ప్రకటన కూడా చేశారు. అయితే త్వరలో విడుదల అనే సస్పెన్స్ ఆయన కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే తన పార్టీ ఉద్దేశాలు.. విధివిధానాలను ఆయన అప్పుడప్పుడు సినిమా టీజర్ లాగా విడుదల చేస్తున్నారు. విజయ సాయి రెడ్డి ప్రజలను కాకుండా.. సామాజిక మాధ్యమాలను నమ్ముకున్నారు. తన పార్టీ […]

Vijayasai Reddy: శీర్షిక చదివారు కదా.. ఇదేమైనా సినిమానా.. చూసేయడానికి అనే అనుమానం మీలో కలుగుతుంది కదా. ఇప్పటికే రెండుసార్లు విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం పెట్టారు. తన పార్టీకి సంబంధించి ప్రకటన కూడా చేశారు. అయితే త్వరలో విడుదల అనే సస్పెన్స్ ఆయన కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే తన పార్టీ ఉద్దేశాలు.. విధివిధానాలను ఆయన అప్పుడప్పుడు సినిమా టీజర్ లాగా విడుదల చేస్తున్నారు.

విజయ సాయి రెడ్డి ప్రజలను కాకుండా.. సామాజిక మాధ్యమాలను నమ్ముకున్నారు. తన పార్టీ గురించి.. విధివిధానాల గురించి ఇప్పటివరకు కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. ఇప్పుడు వాటిని బహిరంగంగా బయటపెట్టే క్రమంలో రీల్స్ ను ఉపయోగిస్తున్నారు. జన్ జడ్ మీద పూర్తిగా దృష్టి సారించిన ఆయన.. వారిని ఆకట్టుకునేందుకు రీల్స్ మాత్రమే మార్గమని భావించారు. అందువల్లే రియల్ టైం నుంచి రీల్స్ టైం లోకి వచ్చేసారు.

ఒకప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక నాయకుడిగా ఉండేవారు. జగన్ కు దగ్గరగా ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుని పనులు నిమగ్నమయ్యారు. అయితే ఆయన రాజకీయాల్లోకి తిరిగి వచ్చిన తీరు.. ప్రజల్లోకి వెళ్లాలి అనుకుంటున్నా ప్రచార పద్ధతులు ఇప్పుడు పూర్తిగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సోషల్ మీడియా రీల్స్ ద్వారా తన రాజకీయ ఆలోచనలను ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

విజయసాయిరెడ్డి గతంలో రాజ్యసభ సభ్యుడిగా.. వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2025 జనవరిలో రాజ్యసభ సభ్యత్వానికి.. వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా.. క్రియాశీలమైన రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు. అయితే ఆ విరామం ఎక్కువ కాలం కొనసాగలేదు. సరిగా ఈ ఏడాది ఆగస్టులో తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రజల గొంతుకను.. అసెంబ్లీ.. పార్లమెంట్లో వినిపించేందుకు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ఆయన వెల్లడించారు.

ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీలు రావడం కొత్తేమీ కాదు. కానీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి తిరిగి వస్తున్న తీరు మాత్రం ఆసక్తిని కలిగిస్తోంది. ఒకప్పుడు వైసిపి కీలక వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు అడుగులు వేస్తున్నారు. అయితే ఈసారి ఆయన రాజకీయ ప్రచారంలో సోషల్ మీడియాకు.. ముఖ్యంగా డిజిటల్ మీడియాకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయాలు మారిపోతున్నాయా.. రాజకీయ ప్రచారం రీల్స్ స్థాయికి చేరుతోందా అరే చర్చ కూడా మొదలైంది. విజయ్ సాయి రెడ్డి గతంలో జగన్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాలలో కీలక పాత్ర పోషించారు. రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అయితే 2025 జనవరిలో ఊహించని విధంగా రాజ్యసభ సభ్యత్వానికి.. వైసీపీకి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటారని సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ 2020లో మళ్ళీ తన రాజకీయ భవిష్యత్తుపై కీలకమైన ప్రకటనలు చేస్తూ.. సంచలనానికి కారణమయ్యారు.

తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభించాలని విజయ సాయి రెడ్డి అనుకున్నారు. టిడిపి.. వైసిపి వంటి పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రజల సమస్యలను అసెంబ్లీ.. పార్లమెంట్ లో వినిపించడమే తన లక్ష్యమని చెప్పారు. తన పార్టీలో యువతకు పెద్దపీట వేస్తానని కూడా వెల్లడించారు. 40 సంవత్సరాల వారికి పార్టీలో అవకాశాల్లో 66% ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించడం.. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు పదివేల భృతి ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తావించారు..

కొత్త పార్టీ ఏర్పాటుకు విజయసాయిరెడ్డి ముహూర్తాన్ని కూడా ప్రకటించారు. నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో పార్టీ పేరు ప్రకటిస్తానని అక్టోబర్ 20న ఆయన వెల్లడించారు. దీంతో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాక మీద చర్చ మొదలైంది. ఇప్పటి రాజకీయాల్లో సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు మాత్రమే సరిపోవడం లేదు.. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వెళ్లడం కూడా ముఖ్యమైనదని.. ముఖ్యంగా యూట్యూబ్ షాట్స్..ఇన్ స్టా గ్రామ్ రీల్స్, ఫేస్ బుక్ వీడియో ద్వారా తన ప్రసంగాలను ప్రజలకు తీసుకెళ్లాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper