Pune, India - August 15 2020: The Mumbai-Pune Expressway during the monsoon season near Pune India. Monsoon is the annual rainy season in India from June to September.
NHAI Greenfield Highway : తెలుగు రాష్ట్రాలకు నాగ్పూర్ – విజయవాడ ఎకనామిక్ కారిడార్ గొప్ప వరం కానుంది. ఈ కారిడార్ తెలంగాణలోని వరంగల్, మంచిర్యాల మీదుగా వెళుతుండడంతో తెలంగాణ, ఏపీకి ఇది గొప్ప ప్రయోజనం కలుగనుంది. నాగ్పూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్ భారతదేశాన్ని ఆగ్నేయ కోస్తాతో కలుపుతుంది. ఈ కారిడార్ నిర్మాణానికి త్వరలో టెండర్లను ఆహ్వానించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యోచిస్తోంది. ఇది త్వరలోనే రూపుదిద్దుకుంటోంది.
Pune, India – August 15 2020: The Mumbai-Pune Expressway during the monsoon season near Pune India. Monsoon is the annual rainy season in India from June to September.
నాగ్పూర్ – విజయవాడ ఎకనామిక్ కారిడార్ మహారాష్ట్ర, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళుతుంది. ఈ ప్రాజెక్ట్ నాలుగు లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా తీసుకోబడింది. ఖమ్మం నుండి విజయవాడ.. మంచిర్యాల నుండి వరంగల్ మధ్యలో ఈ పని ప్రారంభమైంది.
ఇప్పుడు తెలంగాణలోని మంచిర్యాలు -వరంగల్ మధ్య 108 కిలోమీటర్ల పొడవైన గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కోసం టెండర్లను ఆహ్వానించాలని ఎన్.హెచ్ఏఐ నిర్ణయించిందని నివేదించింది. ఇది మంచిర్యాల పట్టణానికి సమీపంలోని నర్వ గ్రామం వద్ద ప్రారంభమై వరంగల్ నగరం సమీపంలోని ఊరుగొండ గ్రామంలో ముగుస్తుంది. దీని అంచనా వ్యయం రూ.2,500 కోట్లు. ఈ ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి ఒక్కొక్కటి రూ. 850 కోట్లు ఖర్చు చేస్తారు.
ముందుగా నర్వ గ్రామం నుంచి పుట్టపాక వరకు 31 కి.మీ పొడవునా ప్యాకేజీ-1లో పనులు ప్రారంభించనున్నారు. నాగ్పూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్లో ఖమ్మం నుండి విజయవాడ వరకు భూసేకరణ పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్లోని కీలకమైన నగరాలను కలిపే ఈ స్ట్రెచ్ విజయవాడ సమీపంలోని జక్కంపూడి వద్ద ప్రారంభమై ఖమ్మం సమీపంలోని వి.వెంకటాయపాలెం వద్ద ముగుస్తుంది.
పూర్తయిన తర్వాత నాగ్పూర్ – విజయవాడ ఎకనామిక్ కారిడార్ ఇప్పటికే ఉన్న రహదారులపై రద్దీని తగ్గిస్తుంది. వివిధ నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఉత్తర తెలంగాణ మరియు విదర్భ ప్రాంతాలకు పోర్ట్ కనెక్టివిటీని ఇది అందిస్తుంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Nagpur vijayawada economic corridor nhai to begin work on mancherial warangal greenfield highway in telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com