Homeలైఫ్ స్టైల్Modern Youth Marriage: పెళ్లి వద్దు.. సోలో లైఫే సో బెటరూ.. మారుతున్న యువత...

Modern Youth Marriage: పెళ్లి వద్దు.. సోలో లైఫే సో బెటరూ.. మారుతున్న యువత దృక్పథం..

Modern Youth Marriage: బెండకాయ ముదిరితే కూరకు పనికిరాదు..బ్రహ్మచారి ముదిరితే పెళ్లికి పనికిరాడు. ఇది ఒకప్పుడు విపరీతమైన ప్రచారంలో ఉన్న సామెత. ఇప్పుడు దీనికి ఈ తరం యువత అర్థం మార్చేశారు.. బెండకాయ ముదిరితే కూర వండుకోవడం మానేయాలి. బ్రహ్మచారి ముదిరితే హేళన చేయడం ఆపాలి. ఎవడి జీవితం వాడిది. బెండకాయ కూర వండుకోవాలని ఎందుకనుకోవాలి.. ఎన్నో రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి కదా.. అని నేటి యువత సమాధానం చెబుతున్నారు.

చదువు.. ఉద్యోగం.. కెరియర్.. ఆ తర్వాత అత్యున్నత స్థాయి అందుకోవాలని నేటి యువత భావిస్తోంది. అందువల్లే పెళ్లి అనే ఆలోచనను పక్కనపెడుతోంది. పైగా నేటి కాలంలో పిల్లల అభిప్రాయానికే తల్లిదండ్రులు ఓటు వేస్తున్నారు. అందువల్ల చాలామంది యువత తమకు నచ్చినట్టు బతికేస్తున్నారు. కేవలం యువకులు మాత్రమే కాదు.. యువతులు కూడా ఇలానే ఉండిపోతున్నారు.. నచ్చిన ఉద్యోగం చేయడం.. మెచ్చినట్టుగా బతికేయడం.. స్నేహితులతో కాలక్షేపం చేయడం.. టైంపాస్ కాకపోతే ట్రావెలింగ్ చేయడం వంటి వాటిని నేటి యువత ఎంచుకుంటున్నది. ఒకవేళ ప్రేమ వ్యవహారాలు గనక ఉండి ఉంటే.. వాటిని పెళ్లి వరకు రానివ్వడం లేదు.. కో లివింగ్ ను నేటి యువత విపరీతంగా ఇష్టపడుతోంది. గతంలో ఈ కల్చర్ వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండేది. ఇప్పుడు మనదేశంలోకి కూడా వ్యాపించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ సమాచారం ప్రకారం స్వీడన్ దేశంలో 51 శాతం, డెన్మార్క్ లో 50%, పిన్ ల్యాండ్లో 49%, జర్మనీలో 48%, నార్వే లో 47 శాతం ఒంటరిగానే ఉంటున్నారు. వ్యక్తిగత స్వేచ్చను అక్కడి ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఇక మనదేశంలో 25 శాతం సింగిల్గానే ఉంటున్నారు.. వ్యక్తిగత స్వేచ్ఛ కావాలని.. పెళ్లి అనేది ఆప్షన్ మాత్రమేనని.. జీవితాన్ని నచ్చినట్టు జీవించాలని ఈ సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు.

పెళ్లి అనేది అవసరం లేదని.. మన స్వేచ్ఛను ఒకరి దగ్గర తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని.. ఒకరు చెప్పినట్టు వింటే అప్పుడు మన జీవితానికి అర్థం ఏంటని నేటి యువత ప్రశ్నిస్తోంది. కష్టపడి.. సంపాదించి.. అన్ని రకాలుగా సౌకర్యాలు సమకూర్చిన తర్వాత.. గొడవలు పడుతూ ఉంటే అలాంటి బంధాన్ని ఎందుకు కొనసాగించాలని నేటి యువత ప్రశ్నిస్తోంది.

ఒంటరిగా ఉంటే మాత్రం నరకానికి పోతామా.. జంటగా ఉంటే మాత్రం స్వర్గ సుఖాలను అనుభవిస్తామా.. అంటూ వితండవాదానికి దిగుతున్నారు. ప్రేమ అనేది అందులో మునికి తేలడానికేనని.. పెళ్లి చేసుకుని దానిని సర్వనాశనం చేయడానికి కాదని మెజారిటీ యువత అభిప్రాయపడుతోంది. అందువల్లే తమ పెళ్ళికి దూరంగా ఉంటామని చెబుతోంది. ఈ సర్వే నేటికాలపు యువత అభిప్రాయాలను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇలానే కొనసాగితే జనాభా సంక్షోభం ఏర్పడి.. అది కాస్త ఆయా దేశాల ప్రగతి మీద ప్రభావం చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper