spot_img
Homeలైఫ్ స్టైల్Uncle Affection : మేనకోడలి పెళ్లికి రూ.3 కోట్ల కట్నం.. ఈ మామల ప్రేమకు ఊరంతా...

Uncle Affection : మేనకోడలి పెళ్లికి రూ.3 కోట్ల కట్నం.. ఈ మామల ప్రేమకు ఊరంతా ఫిదా

Uncle Affection  : సహజంగా అమ్మాయిలకు మగవారి మీద, అబ్బాయిలకు ఆడవారి మీద ప్రేమ ఉండటం కామనే. కూతుళ్లకు నాన్నంటే కొడుకులకు అమ్మంటే ఇష్టపడతారు. వారితోనే ఫ్రీగా ఉంటారు. ఇలా అన్యోన్యత అనేది ఆడపిల్లల విషయంలో ఎక్కువగానే ఉంటుంది. అందులో మేనకోడలంటే అందరికి ఇష్టమే. బిడ్డలతో సమానంగా చూసుకుంటారు. వారికి ఏది ఇష్టమైతే అది కొనివ్వడం సహజమే. అందుకే తండ్రి మీద కంటే ఆడపిల్లలకు మేనమామల మీదే అధికారం ఉంటుంది. మామ నాకు అది కావాలంటే క్షణాల్లో కొనిచ్చేందుకే మొగ్గు చూపుతారు. అందుకే తండ్రి లేకపోయినా మేనమామ ఉండాలని చెబుతుంటారు.

మేనకోడలి కోసం..

మేనకోడలి పెళ్లి అంటే మామలకు సంబరమే. ఆమెకు తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత పెట్టి పెళ్లి చేయడానికి మేనమామలు ముందుకొస్తారు. తలో ఇంత వేసుకుని ఆమె మనసు నొచ్చుకోకుండా లాంఛనాలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇంకా కొందరైతే పెళ్లి ఖర్చులు పెట్టుకుని తమ ప్రేమను చాటుకుంటుంటారు. అలా మేనకోడలి కోసం త్యాగాలు చేసే వారు సైతం ఉంటారు. అందరి గుణం ఒకే తీరుగా ఉండదు. కొందరు తప్పించుకునే వారు కూడా ఉంటారు. ఇంకా కొందరు సర్వస్వాన్ని పెడుతుంటారు.

రాజస్థాన్ లో..

తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో మేనమామలు కోడలి పెళ్లి కోసం ఏకంగా రూ. 3.21 కోట్లు ఇవ్వడం సంచలనం కలిగించింది. నాగౌర్ జిల్లాలోని బుర్డీ గ్రామానికి చెందిన హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్ర అనే ముగ్గురు అన్నదమ్ములు తమ మేన కోడలి కోసం ఇంత మొత్తం ఆస్తులు కట్నంగా ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు. కూతుళ్లకే ఇవ్వడానికి ఇష్టపడని వారున్న సందర్భంలో మేనకోడలికి ఇంత భారీ మొత్తం కట్నంగా ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారు. మేనకోడలిపై ఉన్న ప్రేమకు అవాక్కవుతున్నారు.

ముగ్గురు సోదరులు..

ముగ్గురు సోదరులు కలిసి కోడలికి 10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 30 లక్షల విలువ చేసే స్థలం, 41 తులాల బంగారం, 3 కిలోల వెండి, ఓ ట్రాక్టర్, స్కూటీ, రూ. 80 లక్షల నగదు అప్పగించారు. దీంతో ఊళ్లోని ప్రతి ఇంటికి ఓ వెండి నాణెం కానుకగా అందించారు. దీంతో మేనకోడలిపై వారికి ఉన్న ప్రేమ ఎంతటిదో అర్థమవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చి పెళ్లి చేసేందుకు వారు ముందుకు రావడం గమనార్హం. అన్నదమ్ముల అనుబంధానికి మేనకోడలు మురిసిపోతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Pawan Kalyan And Allu Arjun

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...
Spirit Movie

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...
Chiranjeevi And Pawan Kalyan

Pawan Kalyan And Chiranjeevi: మెగా ఫ్యామిలీ లో చిరంజీవి కాకుండా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన...

Pawan Kalyan And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అతని తర్వాత అతని తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీకి...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Oktelugu Epaper