spot_img
Homeలైఫ్ స్టైల్Good news for Instagram users: Instagram వాడేవారికి గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్య...

Good news for Instagram users: Instagram వాడేవారికి గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్య లేనట్లే..

Good news for Instagram users: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎక్కువగా వాడే వారు Instagramపై ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. అయితే తన యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి దీని మాతృ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు కామెంట్లలో చిన్న తప్పు జరిగినా డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా కామెంట్‌ను ఎడిట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

ఈ కొత్త ఫీచర్ ప్రకారం.. యూజర్లు కామెంట్ పోస్ట్ చేసిన తర్వాత 15 నిమిషాల లోపు తమ కామెంట్‌ను సవరించుకోవచ్చు. ఈ సమయంలో ఒక్కసారి కాదు, కావాలంటే ఎన్నిసార్లైనా మార్పులు చేసుకునే సౌలభ్యం ఉంది. దీంతో తొందరపాటులో చేసిన టైపింగ్ తప్పులు లేదా అర్థం మారేలా ఉన్న వాక్యాలను సులభంగా సరిచేసుకోవచ్చు. అయితే ఈ ఎడిట్ ఫీచర్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. యూజర్లు కేవలం కామెంట్‌లోని టెక్స్ట్‌ను మాత్రమే మార్చగలరు. ఫొటోలు, GIFలు లేదా స్టిక్కర్లు వంటి ఇతర ఎలిమెంట్స్‌ను మార్చడం సాధ్యం కాదు. అంటే కామెంట్‌లో జోడించిన ఇతర మీడియా అంశాలు అలాగే ఉంటాయి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు కామెంట్‌ను ఎడిట్ చేసినట్లు ఇతర యూజర్లకు తెలుస్తుంది. కామెంట్ పక్కన ‘Edited’ అనే ట్యాగ్ కనిపిస్తుంది. అయితే, మీరు ముందుగా ఏమి రాశారో మాత్రం ఇతరులకు కనిపించదు. ఇది యూజర్ల ప్రైవసీని కూడా కాపాడే విధంగా రూపొందించబడింది. ఈ ఫీచర్ ద్వారా సోషల్ మీడియాలో కమ్యూనికేషన్ మరింత సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా త్వరగా స్పందించే సమయంలో వచ్చే పొరపాట్లను వెంటనే సరిచేసుకునే అవకాశం ఉండటం వల్ల యూజర్లకు మంచి ఉపయోగం కలుగుతుంది. ఈ అప్‌డేట్ Instagram వాడకాన్ని మరింత స్మార్ట్‌గా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Oktelugu Epaper