Homeఎంటర్టైన్మెంట్LIK movie first day collections: 'LIK' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు...

LIK movie first day collections: ‘LIK’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు లో ప్రింటు ఖర్చు కూడా రాలేదుగా..

LIK movie first day collections: వరుస హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన ‘LIK’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన సినిమా , బాగా ఆలస్యం అవ్వడం తో ఈ చిత్రం పై మార్కెట్ లో ఎందుకో అనుకున్నంత రేంజ్ లో బజ్ క్రియేట్ అవ్వలేదు. కానీ తమిళనాడు యూత్ మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం […]

LIK movie first day collections: వరుస హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన ‘LIK’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన సినిమా , బాగా ఆలస్యం అవ్వడం తో ఈ చిత్రం పై మార్కెట్ లో ఎందుకో అనుకున్నంత రేంజ్ లో బజ్ క్రియేట్ అవ్వలేదు. కానీ తమిళనాడు యూత్ మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా అసలు పట్టించుకోవడం లేదు. ప్రదీప్ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది అనే నమ్మకం తో థియేటర్స్ లో కదులుతున్నారు. ఫలితంగా ఈ చిత్రానికి మొదటి రోజుకంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా తమిళనాడు రెండవ రోజు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి.

అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం తమిళనాడు ప్రాంతం నుండి 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. ఎలాంటి బజ్ క్రియేట్ చేయని మూవీ కి ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. తమిళనాడు పరిస్థితి అలా ఉంటే , తెలుగు రాష్ట్ర పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే , ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ నుండి 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి అట. ప్రదీప్ గత ‘డ్యూడ్’ ఓపెనింగ్ తో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. రాయలసీమ ప్రాంతం లో అయితే ఈ చిత్రం పరిస్థితి వర్ణనాతీతం అనే చెప్పొచ్చు. సీమ మొత్తానికి కలిపి ఈ చిత్రానికి కేవలం 9 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట.

హైదరాబాద్ సిటీ లో కేవలం ఒక్క థియేటర్ నుండి నమోదు అయ్యే గ్రాస్ వసూళ్లు ఇది. నార్త్ అమెరికా లో కూడా వసూళ్లు ఏ మాత్రం పుంజుకోలేదు. ప్రీమియర్ షోస్ + మొదటి రోజు కలిపి కేవలం 80 వేల డాలర్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు + తమిళ భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. డివైడ్ టాక్ మీద ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. అయితే బ్యాడ్ లక్ ఏమిటంటే, ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం అసాధ్యం. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రానికి 50 నుండి 60 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు క్లోజింగ్ లో నమోదు అవుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper