Homeలైఫ్ స్టైల్Bank Holidays Latest News: బ్యాంకు పనులు ఉన్నవారు వెంటనే అలర్ట్ కండి

Bank Holidays Latest News: బ్యాంకు పనులు ఉన్నవారు వెంటనే అలర్ట్ కండి

Bank Holidays Latest News: దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ కావాల్సిన అసవరం ఏర్పడింది. మే 23 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు ఉండవని తెలుస్తోంది. వీకెండ్ సెలవులు, ఉద్యోగుల సమ్మె పిలుపు, బక్రీద్ పండుగ సెలవులు కలిసి రావడంతో బ్యాంకు శాఖలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా State Bank of India సేవలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. మే 23 నాల్గో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, […]

Bank Holidays Latest News: దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ కావాల్సిన అసవరం ఏర్పడింది. మే 23 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు ఉండవని తెలుస్తోంది. వీకెండ్ సెలవులు, ఉద్యోగుల సమ్మె పిలుపు, బక్రీద్ పండుగ సెలవులు కలిసి రావడంతో బ్యాంకు శాఖలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా State Bank of India సేవలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి.

మే 23 నాల్గో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు అధికారిక సెలవు ఉంటుంది. ప్రతి నెల రెండో, నాల్గో శనివారాల్లో బ్యాంకులు పనిచేయవు. దీంతో ఆ రోజు అన్ని శాఖలు మూసివేయబడతాయి.

మే 24 ఆదివారం కావడంతో సాధారణ వారాంతపు సెలవు అమల్లో ఉంటుంది. వరుసగా రెండు రోజుల పాటు బ్యాంకులు పనిచేయకపోవడంతో నగదు లావాదేవీలు, చెక్ క్లియరెన్స్ వంటి సేవల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది.

మే 25, 26 తేదీల్లో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఉద్యోగుల నియామకాలు, ఔట్‌సోర్సింగ్, పెన్షన్, బదిలీలు తదితర డిమాండ్లపై ఈ సమ్మె చేపడుతున్నట్లు సంఘాలు ప్రకటించాయి. సమ్మె జరిగితే బ్రాంచ్ సేవలు, చెక్ క్లియరెన్స్, రుణ ప్రాసెసింగ్ వంటి సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు సాధారణంగా కొనసాగవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.

బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో మే 27న, మరికొన్ని ప్రాంతాల్లో మే 28న బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు కూడా సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. స్థానిక సెలవుల ప్రకారం తేదీలు మారవచ్చు.

వినియోగదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి వరుస సెలవుల కారణంగా నగదు అవసరాలు, చెక్కుల క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్టులు, బ్రాంచ్‌లో చేయాల్సిన పనులు ముందుగానే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులు, జీతభత్యాల లావాదేవీలు చేసే సంస్థలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. బ్యాంకు శాఖలు మూసివున్నా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసర లావాదేవీల కోసం డిజిటల్ పేమెంట్స్‌ను వినియోగించుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper