spot_img
Homeలైఫ్ స్టైల్Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాలు.. 50 వేల నుంచి లక్ష వరకు జీతం. ఇప్పుడే దరఖాస్తు...

Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాలు.. 50 వేల నుంచి లక్ష వరకు జీతం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

Government Jobs: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అది కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇప్పుడు భారత ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం ఉంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో జాబ్ లు ఉన్నాయి. దీని కోసం కూడా ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ recindia.nic.in లో చూడవచ్చు. ఇక్కడ నుంచి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కానీ ఈ పోస్టులకు మాత్రం మీరు ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోనే దరఖాస్తు చేసుకోండి.

ఈ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్/చీఫ్ మేనేజర్/అధికారిక భాషా వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పోస్టుల్లో మొత్తం 74 ఖాళీలు ఉండటంతో వాటిని ఫిల్ చేయాలి అనుకుంటున్నారు. recindia.nic.inలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత మీరు సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంది. సో ఈ సమయంలోపే దరఖాస్తు చేసుకోండి. ఇక రుసుము వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు.

REC లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్/చీఫ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్‌లో B.Tech/M.Tech డిగ్రీని చేసి ఉండాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 48 ఏళ్లు ఉండాలి. ఇక చీఫ్ మేనేజర్ పోస్టులకు మాత్రం 45 ఏళ్లు ఉండాలి అని ఖరారు చేశారు. అధికారి కావడానికి, వయోపరిమితి 33 సంవత్సరాలు. ఇక డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్‌కు గరిష్ట వయస్సు మాత్రం 39 సంవత్సరాలు ఉండాలి అని నోటిఫికేషన్ లో తెలిపారు. ఇది కాకుండా, వివిధ పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ నోటిఫికేషన్‌లో చూడవచ్చు .

REC లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు జీతం రూ. 1,00,000-2,60,000 కాగా, చీఫ్ మేనేజర్ జీతం రూ.80,000గా ఉంటుంది. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ జీతం రూ.70,000-2,00,000గా నిర్ణయించారు. ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు రూ. 50,000-1,60,000 జీతం పొందుతారు. డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) రూ.70,000-2,00,000. ఇక మీరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లే చేసుకోవాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేసుకోవడం ఉత్తమం. అయితే వెయ్యి రూపాయల రుసుము ఉంది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లే చేసుకోండి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper