Gen Z Networking Skills : సమాజంలో ఉద్యోగం, వ్యాపారం చేయడం ఎంత ముఖ్యమో.. మనుషులతో సంబంధాలు నెలకొల్పడం అంతే ముఖ్యం. మనుషుల మధ్య కమ్యూనికేషన్ ఉంటేనే కెరీర్లో ఎదగడం లేదా వ్యాపారంలో రాణించడం జరుగుతుంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న జెన్ Z గా పిలిచే యువతలో కమ్యూనికేషన్స్ స్కిల్స్ చాలా తక్కువగా ఉన్నాయని.. దీంతో ఇది వీరికి అడ్డంకిగా మారుతుందని ప్రముఖ సంస్థ లింక్డ్ ఇన్ తెలిపింది. దీంతో యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఈ నివేదిక గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ కమ్యూనికేషన్స్ సంస్థ లింక్డ్ ఇన్ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో సుమారు 83 శాతం మంది జెన్ జడ్ యువత నెట్వర్కింగ్ చేయడంలో వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. నెట్వర్కింగ్ అంటే చాలామంది కేవలం ఉద్యోగం కోసం ఇతరులను పరిచయం చేసుకోవడమే అని అనుకుంటున్నారు. కానీ వారి జీవిత విశేషాలను ఇతరులతో పంచుకోవడం.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం .. కెరీర్ కు సంబంధించిన విషయాలను అడగడం.. ఇతరులకు చెప్పడం వంటివి ఉంటాయి.
అయితే ఈ విషయాలను ఇతరులతో పంచుకోవడంలో ఇప్పుడున్న యువతలో మొహమాటం ఎక్కువగా ఉన్నట్లు లింక్డ్ ఇన్ సంస్థ తెలిపింది. దీంతో యువత ఇతరులు ఏమనుకుంటారో నన్న భయం ఎక్కువగా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ విషయంలో యువత సీనియర్లను ఏదైనా విషయాలను అడగాలంటే చాలా భయపడిపోతున్నారు. అంతేకాకుండా తాము ఏదైనా మాట్లాడితే తిరస్కరిస్తారేమోనని.. తమ ఆలోచన ఇతరికి నచ్చదేమోనన్న మొహమాటంతో ఉన్నట్లు తెలుపుతున్నారు.
లింక్డ్ ఇన్ తెలిపిన మరో విషయం ఏమిటంటే.. యువతలో 79 శాతం తమ కెరీర్ నెట్వర్క్ ప్రాముఖ్యత గుర్తిస్తున్నప్పటికీ.. 52 శాతం మందికి అసలు నెట్వర్కింగ్ ను ఎలా ప్రారంభించాలో తెలియడం లేదని తెలిపింది. ఇందులో భాగంగా ఇతరులతో ఎలా మాట్లాడాలి? మొదటి మెసేజ్ ఎలా పంపాలి? తమ గురించి ఎలా పరిచయం చేసుకోవాలి? అనే విషయాలను ఇతరులతో పంచుకోవడం లేదు.
అయితే కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం నెట్వర్కింగ్ అంటే ఒకేరోజు వందల మందిని పరిచయం చేసుకోవడం కాదు.. ముందుగా తమ రంగానికి సంబంధించి ఒకరితో పరిచయం ఏర్పడి ఆ తర్వాత నెట్వర్క్ పెంచుకొని అవసరం ఉంటుందని తెలుపుతున్నారు. తమ ప్రొఫెషనల్ స్పైస్ ఇతరులను ప్రశ్నలు అడగడం.. కొత్త పరిచయాలు చేసుకోవడం వల్ల సమాజంలో అవగాహన కలుగుతుందని అంటున్నారు. అయితే నేరుగా ఇతరులతో మాట్లాడే ఇష్టం లేకపోతే సోషల్ మీడియా ఫ్లాట్ఫారం ద్వారా కూడా పరిచయం చేసుకోవచ్చని తెలుపుతున్నారు.
యువతలో నెట్వర్కింగ్ సమస్త ఉంటే భారీగా అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని లింకుడ్ ఇన్ సంస్థ తెలుపుతుంది. కొన్నిసార్లు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే కాకుండా మనకు తెలిసిన వ్యక్తుల ద్వారా కూడా అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని.. ఈ నేపథ్యంలో పరిచయాలు ఎంతో ముఖ్యమని అంటున్నారు. అంతేకాకుండా తమకు ఉన్న నైపుణ్యాలను ఇతరులకు తెలపాలంటే నెట్వర్కింగ్ ఎంతో అవసరమని చెబుతున్నారు.