Homeలైఫ్ స్టైల్Digital Payments: అంతా ఫోన్ తోనే ఖర్చుపెట్టారు.. మే నెలలో ఎన్ని కోట్లంటే..

Digital Payments: అంతా ఫోన్ తోనే ఖర్చుపెట్టారు.. మే నెలలో ఎన్ని కోట్లంటే..

Digital Payments: Unified Payments Interface (UPI) మే నెలలో సరికొత్త రికార్డు సృష్టించిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. ఈ నెలలో యూపీఐ ద్వారా మొత్తం రూ.29.90 లక్షల కోట్ల విలువైన టాప్-అప్ లావాదేవీలు జరిగాయి. అలాగే మొత్తం లావాదేవీలు సంఖ్యా పరంగా 2,320 కోట్లకు చేరాయి. ఇది దేశీయోల ఆన్‌లైన్ పేమెంట్స్‌లో భారీ పెరుగుదలకు సంకేతమని NPCI తెలిపింది. అయితే ఈ లావాదేవీలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే? […]

Digital Payments: Unified Payments Interface (UPI) మే నెలలో సరికొత్త రికార్డు సృష్టించిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. ఈ నెలలో యూపీఐ ద్వారా మొత్తం రూ.29.90 లక్షల కోట్ల విలువైన టాప్-అప్ లావాదేవీలు జరిగాయి. అలాగే మొత్తం లావాదేవీలు సంఖ్యా పరంగా 2,320 కోట్లకు చేరాయి. ఇది దేశీయోల ఆన్‌లైన్ పేమెంట్స్‌లో భారీ పెరుగుదలకు సంకేతమని NPCI తెలిపింది. అయితే ఈ లావాదేవీలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే?

NPCI వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 మే నెల లావాదేవీలు గత ఏప్రిల్ కంటే పెరిగింది. గత ఏడాది ఇదే మే నెలలో నమోదైన రూ.25.14 లక్షల కోట్లతో పోల్చితే ఇప్పుడు ఏడాదిలో యూపీఐ లావాదేవీల విలువ సుమారు 19 శాతం వృద్ధి చెందింది. సంఖ్యా పరంగా కూడా గతేడాది 1,867 కోట్లు కాగా.. ఈసారి 2,320 కోట్లకు చేరి 24 శాతం వృద్ధి కనబరిచింది.

ఈ సందర్భంగా క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాశ్ సిన్హా మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పెరిగిన ప్రయాణాలు, ఐపీఎల్ సీజన్ కారణంగా టికెట్ , ఫుడ్, ట్రావెల్ ఫై కార్డుల ద్వారా విపరీతంగా ఆర్థిక లావాదేవీల జరిగాయి. అలాగే నెలవారీ యూపీఐ లావాదేవీలు పెరిగి ఈ రికార్డు స్థాయిని తాకాయన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నివేదిక ప్రకారం.. యూపీఐలో సగటు లావాదేవీ పరిమాణం 2021లో సుమారు రూ.1,848 ఉండగా.. 2025 నాటికి అది రూ.1,313 వరకు తగ్గింది. దీంతో యూపీఐ ఎకోసిస్టమ్ బలోపేతానికి చేసిన కృషి ఫలితానికి తాజాగ నివేదికలే నిదర్శనమని తెలుస్తోంది.

అంతేకాకుండా మే 2026లో నమోదైన యూపీఐ లావాదేవీ రికార్డు విలువ ఆర్థిక వృద్ధి లక్షణాలను చూపుతున్నాయి. సీజనల్ ఈవెంట్లు, వినియోగపు మార్పులు, పెరిగిన డిజిటలైజేషన్ కారణంగా ఈ వృద్ధి నమోదవుతున్నట్లు NPCI మరియు పరిశీలకులు పేర్కొంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper