Financial problem-solving strategies: ప్రపంచంలో ప్రతీ ఒక్కరు డబ్బు కోసం కష్టపడుతుంటారు. అందుకే ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు చెప్తుంటారు కూడా. నిత్యం అవసరాలు తీర్చుకోవాలన్నా, జీవితంలో ఇంకేదేని పని చేయాలన్నా డబ్బు కంపల్సరీ. ఈ నేపథ్యంలో మనీ సంపాదించడం కోసం ప్రతీ ఒక్కరు కష్టపడుతుంటారు. అయితే, కొంత మంది ఎంత కష్టపడ్డప్పటికీ వారి ఆర్థిక సమస్యలు అస్సలు తీరబోవు. వాటికి రకరకాల కారణాలూ ఉంటాయి. కాగా, భగవంతుడి అనుగ్రహం ఉండకపోవడం ఓ కారణమని కొందరు చెప్తున్నారు.

దేవదేవుడి అనుగ్రహం ఉంటేనే ఆర్థిక సమస్యల నుంచి వ్యక్తులు బయటపడుతారని వివరిస్తున్నారు. కాగా, అనుగ్రహం పొందేందుకుగాను ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారం కావాలని దేవతలకు ప్రార్థనలు చేస్తుంటారు. అలా దేవుడికి ప్రార్థనలు చేయడం ద్వారా దేవుడు తమ మొర ఆలకించి సమస్యలు పరిష్కరిస్తాడని భావిస్తారు కూడా. కాగా, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారు కంపల్సరీగా చంద్రుడిని పూజించాలని పెద్దలు చెప్తున్నారు. చంద్రుడి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ధనవంతులు అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయని వివరిస్తున్నారు.
Also Read:
Anasuya Bharadwaj: ‘దర్జా’లో అనసూయ.. ఆసక్తికరమైన పాత్ర అట !
చంద్రుడనికి పూజలు చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అష్టమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడికి పెరుగున్నం నైవేద్యం సమర్పించడం ద్వారా ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. తద్వారా వారు ఆటోమేటిక్ గా ధనవంతులు అయపోతారని పండితులు అంటున్నారు. ప్రతీ రోజు ఈవినింగ్ టైమ్స్‌లో ఎంగిలి కానటువంటి పెరుగును చంద్రునికి అరటి ఆకులో సమర్పించడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి. అలా అరటి ఆకులో నైవేద్యం పెట్టడం మంచిది కూడా అని పెద్దలు తెలుపుతున్నారు.

నిరుపేదలకు నీలి రంగు వస్త్రాలను దానం చేయడం కూడా మంచిది. ఒకవేళ అరటి ఆకు లేకపోతే మాత్రం వెండిగిన్నెలో స్వామి వారికి నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. పౌర్ణమి రోజున చంద్రునికి ఎంత నైవేద్యం సమర్పిస్తారో, అదే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి కూడా. అలా ప్రసాదం మాత్రమే తీసుకుని ఉండాలి. ఆ రోజు ఇతర ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. ఇంటి పై కప్పు నుంచి చంద్రుడిని చూస్తూ స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి. అలా చేయడం ద్వారా ఎకానమికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అయిపోయాయి. మీరు రిచ్ అయిపోతారు.