Lata Mangeshkar: భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ కరోనా బారిన పడి, నేడు తుది శ్వాస విడిచి అశేష అభిమానులను కన్నీళ్ల లోకంలోకి నెట్టేశారు. కరోనాతో గత 29 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిన్న చెప్పారు. ఇవాళ ఆమె చనిపోయినట్లు సోదరి ఉష మంగేష్కర్ ప్రకటించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా లతా మంగేష్కర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలను మాటల్లో చెప్పలేమన్నారు. ఆమె మరణం తనకు వ్యక్తిగతంగానూ నష్టాన్ని చేకూర్చుతుందని ట్వీట్ చేశారు. ఇక లతా మంగేష్కర్ మృతిపట్ల ఆమె జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం జాతీయ సంతాప దినాలు ప్రకటించింది.
Also Read:వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !
గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని అధికార వర్గాలు వెల్లడించాయి. లతా మంగేష్కర్ కు.. రెండు రోజులు సంతాప దినాలు జరగనున్నాయి. ఇక ఆమె గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు చూద్దాం.

– 13 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో సినీ రంగంలోకి 1942లో నేపథ్య గాయనిగా ప్రవేశించారు.
– ‘మహల్'(1949)సినిమాలోని ఆయేగా ఆనే వాలా పాటతో లతా కెరీర్ మలుపు తిరిగింది.⦁
– 1948-78 మధ్య 30వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.
– 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు.
-1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్.
లతాజీని వరించిన అత్యున్నత పురస్కారాలు ఇవే !
1969లో పద్మ భూషణ్
1989లో దాదా సాహెబ్ ఫాల్కే
1999లో పద్మ విభూషణ్
2001లో భారత రత్న
ఇవి కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ది లీజియన్ ఆఫ్ హానర్ పురస్కారం అందించింది.
Also Read:టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !
[…] Kitchen Tips: ప్రతీ ఒక్కరు అన్నం కూరతో కలుపుకుని తీసుకుంటుంటారు. అలా చక్కగా భోజనం చేయాలంటే కూర సరిగా కుదరాలి. అందులో ఉప్పు, కారం తగినంత ఉండాలి. ఎక్కువైతే మాత్రం చాలా కష్టం. కాగా, ఇలా కొన్ని సార్లు కూరల్లో ఉప్పు, కారం ఎక్కువవుతుండటం జరగొచ్చు. కాగా, అటువంటి సమయంలో కూర మొత్తం వేస్ట్ అయిందని బాధపడనక్కర్లేదు. ఈ సింపుల్ చిట్కాతో కూరలో ఉప్పు, కారం తగ్గించేయొచ్చు. ఎలాగంటే.. […]