Homeలైఫ్ స్టైల్AC usage tips in summer: ఎండాకాలంలో ఏసీ వాడుతున్నారా.. ఈ విషయం తెలుసా

AC usage tips in summer: ఎండాకాలంలో ఏసీ వాడుతున్నారా.. ఈ విషయం తెలుసా

AC usage tips in summer: వర్షాకాలంలో అవసరం ఉండదు. శీతాకాలంలో దాని జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ ఎండాకాలంలో మాత్రం దానితో నిత్యం పనే ఉంటుంది. అది కాసేపు పనిచేయకపోయినా సరే ఇబ్బంది పడతాం. చెమటలు కక్కుతాం. చివరికి అనేక రకాలుగా ఇబ్బంది పడి బాగు చేయించుకుంటాం. ఆ తర్వాత ఆ చల్లటి గాలిలో హాయిగా సేద తీరుతాం.. అంతటి చల్ల గాలిని ఇచ్చే ఆ యంత్రం పేరు ఏసీ. ఒకప్పటి మాదిరిగా ఎండ […]

AC usage tips in summer: వర్షాకాలంలో అవసరం ఉండదు. శీతాకాలంలో దాని జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ ఎండాకాలంలో మాత్రం దానితో నిత్యం పనే ఉంటుంది. అది కాసేపు పనిచేయకపోయినా సరే ఇబ్బంది పడతాం. చెమటలు కక్కుతాం. చివరికి అనేక రకాలుగా ఇబ్బంది పడి బాగు చేయించుకుంటాం. ఆ తర్వాత ఆ చల్లటి గాలిలో హాయిగా సేద తీరుతాం.. అంతటి చల్ల గాలిని ఇచ్చే ఆ యంత్రం పేరు ఏసీ.

ఒకప్పటి మాదిరిగా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు సరిపోవడం లేదు. ఫ్యాన్లు ఆ చల్ల గాలిని అందివ్వడం లేదు. పైగా కంపెనీలు కూడా ఆఫర్లు ఇస్తున్న నేపథ్యంలో చాలామంది ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఏసీలు ఆన్ చేయగానే చల్ల గాలిని అందిస్తాయి. గదులను అత్యంత చల్లగా మారుస్తాయి. దీనివల్ల శరీరానికి హాయి కలుగుతుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఏసీల వినియోగం కూడా అధికమవుతోంది. గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో రాత్రిపూట కూడా విపరీతంగా ఉక్క పోత ఉంది. దీనివల్ల చాలామంది ఏసీలను విపరీతంగా వాడుతున్నారు.

Also Read: ఈ బ్రాండెడ్ ఏసీ పై 32 శాతం డిస్కౌంట్.. త్వరపడండి..

చల్లగాలి కోసం ఏసీలను వాడటం సర్వ సాధారణమే. కానీ రాత్రిపూట కూడా ఏసీ ని అదేపనిగా ఆన్ చేసుకొని పడుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. దీనివల్ల శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. చర్మం, కళ్ళు పొడి బారతాయని.. ఇంకా అనేక రకాల సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. కండరాలు బిగుసుకుపోయి.. నొప్పి కలుగుతుందని.. దీనివల్ల నడవడం కూడా ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. ఇమ్యూనిటీ తగ్గిపోయి.. అలర్జీలు కూడా వస్తాయని చెబుతున్నారు.

ఏసి ఒక నిర్ణీత సమయం వరకు వాడితేనే బాగుంటుందని.. అంతకుమించి వాడితే ఇబ్బంది తప్పదని వైద్యులు అంటున్నారు.” ఏసీ పనిచేసే విధానం అనేక ప్రక్రియల మీద ఆధారపడి ఉంటుంది. దీని నుంచి వచ్చే చల్లగాలి మనకు మంచి అనుభూతి ఇస్తుంది. కాకపోతే అదేపనిగా ఏసి వాడితే ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా రాత్రిపూట ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటే.. అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్లే ఏసీని వాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాధ్యమైనంత వరకు రాత్రిపూట ఏసీని తక్కువ వాడి.. ఆ తర్వాత ఫ్యాన్ లేదా కూలర్ ఉపయోగిస్తే మంచిదని” వైద్యులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper