Best Ways to Reduce Anger: ప్రతి మనిషి కొన్ని లక్షణాలతో కలిగి ఉంటాడు. ఇవన్నీ కలగలిపితేనే అతని జీవితం. వీటిలో ప్రేమ, ఆవేశం, స్వార్థం, ద్వేషం వంటివి ఉంటాయి. అయితే వీటిలో ఏ ఒక్కటి ఎక్కువైనా లేదా తక్కువైనా వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. అందుకే అన్ని సమపాలలో ఉండే విధంగా చూసుకోవాలి. ఈ లక్షణాలన్నింటిలో కోపం గురించి చెప్పుకుందాం. కోపం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఒక వ్యక్తికి నచ్చని పని కనిపించినా.. ఎదుటివారు ఆ పని చేసినా.. వారిపై కోపం వస్తుంది. దీంతో దానిని తగ్గించుకోవడానికి ఆ వ్యక్తి అరుస్తాడు. అయితే ఈ కోపం వల్ల లాభం ఎంత ఉంటుందో తెలియదు కానీ నష్టం మాత్రం భారీగానే ఉంటుంది. అది ఎలా అంటే?
Also Read: ఇల్లు ఊడ్చే మహిళలకు ఇది తప్పనిసరి..
ఉదాహరణకు దంపతుల మధ్య చిన్న గొడవ ఏర్పడితే ఇద్దరిలో ఎవరు ఒకరు శాంతంగా ఉండి ఎదుటివారి సమస్య ఏంటో తెలుసుకోవాలి. అలాకాకుండా ఒకరికి మించి మరొకరు కోప్పడితే వారి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వారికి పిల్లలు ఉంటే వారిపై ఈ ప్రభావం పడి వారి జీవితం కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కోపం వచ్చినప్పుడు ఎదుటివారు శాంతపరచాలి. లేదా ఎవరికి వారే కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సహజంగానే ప్రతి మనిషిలో కోపం తప్పనిసరిగా ఉంటుంది. అయితే దీనిని సందర్భాన్ని బట్టి వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి విషయంలో కోపాన్ని తెచ్చుకోవడం వల్ల సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు.
.
వాస్తవానికి కోపం రావడం వల్ల కూడా కొన్ని పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు కోపంగా అతనిపై అరిస్తే ఆ వ్యక్తి తప్పు చేయకుండా ఆగిపోతాడు. దీంతో ఒక సమస్యను అప్పుడే పరిష్కరించిన వారవుతారు. అయితే అలా కాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కోపం ఉంటే తప్పుడు మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. దీంతో వారి జీవితం పక్కదారి పడుతుంది.
Also Read: గుడిలో ఆడవారు తలనీలాలు సమర్పించవచ్చా?
అందువల్ల కోపాన్ని సందర్భాన్ని బట్టి లేదా అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలి. అయితే ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాల వల్ల కూడా చాలామందిలో కోపం అనుకోకుండానే ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ సమస్య ఉన్నవారిలో ఈ కోపం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కోపం ఎక్కువగా కలిగి ఉన్నవారు ఆహార పదార్థాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు తక్కువగా ఉండే ఆహారాన్ని తినడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు ప్రయత్నించాలి. అంతేకాకుండా ఏదైనా విషయంలో కోపం వస్తుంది అనుకుంటే అక్కడి నుంచి ఏదో ఒక కారణం చెప్పి పక్కకు వెళ్లాలి. అలా కొంతవరకు సమస్య పరిష్కారమై ఎలాంటి తప్పులకు కారణం కాకుండా ఉండగలుగుతారు.
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల్లోనూ కోపం ఎక్కువగా వస్తోంది. అలా రావడానికి కారణం వారు తినే ఆహారంతో పాటు వారిపై ఒత్తిడి పెరగడమే. ఈ సమయంలో తల్లిదండ్రులు వారి పరిస్థితిని అర్థం చేసుకొని వారి మనసు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.