Donald Trump Iran Nuclear Deal 2026: అగ్రరాజ్యాధినేత పశ్చిమాసియాలో రాజేసిన నిప్పు సెగ అమెరికాకే తాకుతోంది. వారం పది రోజుల్లో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని భావించిన డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. 24 రోజులుగా ఇరాన్ యుద్ధం కొనసాగిస్తోంది. ప్రతీకార దాడులతో అమెరికా అనుకూల గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. అతిపెద్ద సైనిక శక్తి కలిగిన అమెరికాకు చుక్కటు చూపిస్తోంది. దీంతో ట్రంప్ యుద్ధంపై వెనకు తగ్గాడు. ఐదు రోజులు విరామం ప్రకటించాడు. తాజాగా ఆయన వ్యాఖ్యలు పరిశీలిస్తే యుద్ధం పూర్తిగా ముగించే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇకపై ఇరాన్ అణు బాంబు తయారు చేయదని మాకు నమ్మకం కలిగింది. ఈమేరకు ఇరాన్‌తో డీల్ కుదిరింది అని ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఇరాన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా స్తుతి.. వీడియో వైరల్
ట్రంప్ ప్రకటనలో వాస్తవం ఉందా?
హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో ఓపెన్ చేయకపోతే.. ఇరాన్ విద్యుత్ సంస్తలపై దాడులు చేస్తామని ట్రంప్ డెడ్‌లైన్ పెట్టారు. అయితే 24 గంటలు గడిచాక.. యుద్ధం ఐదు రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుత దౌత్య చర్చల్లో ఇరాన్ అణు ఆయుధాల తయారీ ఆపేస్తుందని ట్రంప్ ధీమాగా ప్రకటించడం గత సైనిక దాడుల తర్వాత వచ్చిన మలుపుగా కనిపిస్తోంది. ఒమాన్, జెనీవాలో పరోక్ష చర్చలు జరిగిన నేపథ్యంలో ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి అణు కార్యక్రమాన్ని రద్దు చేయడానికి సిద్ధమని సూచించాడు. అయితే ఇది గౌరవప్రదమైన ఆఫర్‌పై ఆధారపడి ఉంది,
గత సందర్భాల విఫలం..
2015 అణు ఒప్పందం ఇరాన్‌ను తాత్కాలికంగా మేల్కొల్పినా, ట్రంప్ 2018లో దాన్ని ఉపసంహరించడంతో ఇరాన్ యురేనియం సుసంపన్నతను పెంచుకుంది. అమెరికా దాడులు కూడా అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయలేదని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. ఇటువంటి శత్రుత్వం, పరస్పర అనుమానాలు కొత్త ఒప్పందాలను బలహీనపరుస్తాయి.
ఇరాన్ నిలకడగా ఒప్పుకుంటుందా?
ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేస్తుందని« ధ్రువీకరించడం కష్టం. ఎందుకంటే వారు దానిని ‘పౌర శక్తి‘గా చెబుతూ కొనసాగిస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలు ప్రభావం చూపుతున్నాయి, కానీ యురేనియం నిల్వలు సురక్షితంగా ఉన్నాయని, కార్యక్రమం కొనసాగుతుందని నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో పునరావృతమైన ఉల్లంఘనలు జరిగే అవకాశం ఎక్కువ.
ఈ చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్య యుద్ధ మేఘాలు తగ్గుతాయి, అణు వ్యాప్తి నిరోధకత పెరుగుతుంది. కానీ ఇరాన్ మళ్లీ మార్గం మలిచితే అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందని ట్రంప్ స్పష్టం చేయడం ఒత్తిడిని కొనసాగిస్తుంది.
