Telangana : చదువుతుంటే ఖలేజా సినిమాలోని పాలి గ్రామం గుర్తుకు వస్తోంది కదా. అటూ ఇటూగా అలాంటి సన్నివేశమే తెలంగాణలోనూ చోటు చేసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని జంగాలపల్లిలో ఇటీవల 20 మంది చనిపోయారు. వారి వయసు మొత్తం 30 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. దసరా నుంచి ఇప్పటివరకు ఆ గ్రామంలో 20 మంది చనిపోయారు. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురి కావడం … ఆ తర్వాత ఎన్ని ఆసుపత్రులలో చూపించినా నయం కాకపోవడం.. ఆ తర్వాత వారు చనిపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ గ్రామస్తులు భయపడిపోతున్నారు. దయ్యం వల్లే ఇదంతా జరుగుతోందని వణికిపోతున్నారు. గ్రామంలో వరుసగా 20 మంది చనిపోవడంతో గ్రామ దేవతలకు శాంతి పూజలు చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి వచ్చి గ్రామంలో బొడ్రాయి వాస్తుకు విరుద్ధంగా ఉందని.. గ్రామంలో ప్రతి ఒక్కరు పసుపు కుంకుమ బొడ్రాయి నాభి శిల వద్ద చల్లి.. బిందెడు చొప్పున నీరు ఆరబోయాలని సూచించారు . ఆయన చెప్పినట్టుగానే గ్రామస్తులు చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది.
దయ్యం ఉందని వదంతులు
గ్రామంలో దయ్యం సంచరిస్తోందని.. అందువల్లే వరుసగా 20 మరణాలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ” ఎవరికైనా జ్వరం సోకితే చాలు నయం కావడం లేదు. హనుమకొండ, వరంగల్ ప్రాంతాలకు తీసుకెళ్లినా ఉపయోగం ఉండడం లేదు. వెళ్లిన వారి వెళ్లినట్టుగానే శవాలై వస్తున్నారు. ఊరికి దయ్యం పట్టిందని అనిపిస్తోంది. కొంతమంది తమకు దయ్యం కనిపించిందని అంటున్నారు. గ్రామంలో ఎవరూ సాయంత్రమైతే బయటికి రావడం లేదని” గ్రామస్తులు అంటున్నారు. మరోవైపు గ్రామంలో దయ్యం కనిపిస్తున్నదనే వదంతులను వైద్యులు, ఇతర మేధావులు ఖండిస్తున్నారు. తీవ్రమైన అనారోగ్యం వల్లే ఆ 20 మంది చనిపోయారని, గ్రామంలో గ్రామస్తులు తాగుతున్న నీటి శాంపిల్స్ పరిశీలించాలని.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. నాణ్యమైన ఆహారాన్ని తినాలని.. అప్పుడే ఈ మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చని వారు చెబుతున్నారు. మూఢనమ్మకాలను, చేతబడి చేస్తామని చెప్పే వాళ్లను గ్రామస్తులు నమ్ముద్దని సూచిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో జీవనం కొనసాగించాలని వివరిస్తున్నారు. గ్రామంలో వరసగా మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. ప్రభుత్వం తమ గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.. గ్రామంలో వరసగా 20 మంది చనిపోవడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. దయ్యం వదంతులకు ఇది బలంగా మారింది. గ్రామంలో సాయంత్రం పూట ఎవరూ బయటికి రాకపోవడంతో నిర్మానుష్యంగా మారిపోతుంది. కొంతమంది గ్రామస్తులు వరుస మరణాల నేపథ్యంలో తమ బంధువుల ఇంటికి వెళ్ళిపోతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Villagers are afraid that ghost is seen in jangalapalli village
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com