Tagore’ Repeat: ఠాగూర్ సినిమాను ఎవరూ మరిచిపోరు. చనిపోయిన శవానికి ఎన్ని డబ్బులైనా ఇస్తాం బతికించుమంటే కార్పొరేట్ ఆస్పత్రి చేసిన నిర్వాకాన్ని మన చిరంజీవి కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇప్పుడే అదే సీన్ హైదరాబాద్ లో రిపీట్ అయ్యింది. జూనియర్ వైద్యురాలి ప్రాణం తీసింది. ఆమె తరుఫు వారు డబ్బులు కట్టకుంటే చికిత్స ఆపేసి అనంతరం చనిపోయినా కూడా బతికి ఉందని నాటకమాడి లక్షలు గుంజేసిన ఓ ఆస్పత్రి దారుణం వెలుగుచూసింది. పైసలు పీక్కుతునే ఈ కార్పొరేట్ ఆస్పత్రుల ఆగడాలు మరోసారి ఓ కుటుంబాన్ని చిదిమేశాయి.
శవాలతోనూ పైసలు సంపాదించడం అంటే ఇదేనేమో. ఓ వైపు బిడ్డను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని చూసి జాలి చూపాల్సింది పోయి.. మిగిలిన డబ్బు కట్టి శవాన్ని తీసుకువెళ్లండని చెప్పడం ఆందోళనకు దారితీసింది. హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో పరిస్థితులను మరోసారి ఈ ఘటన చాటిచెప్పింది. అనారోగ్యానికి గురైన జూనియర్ డాక్టర్ నాగప్రియను ఆమె కుటుంబసభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. అప్పటికే ఆమెకు ట్రీట్మెంట్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా రూ.4 లక్షలు బిల్లు పెండింగ్‌లో ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆ డబ్బులు కట్టిన తరువాతనే డెడ్ బాడీ ఇస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. దీంతో బాధితులు ఎమ్మెల్యే గాంధీతో చెప్పించారు. అయినప్పటికీ ఆస్పత్రి యాజమాన్యం వినిపించుకోలేదు.
అయితే.. ముందు రోజు అర్ధరాత్రి ఫోన్ చేసి రూ.మూడు లక్షలు కట్టాలని, లేదంటే ట్రీట్మెంట్ నిలిపివేస్తామంటూ ఆస్పత్రివర్గాలు నాగప్రియ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపాయి. ఉదయాన్నే వారు అలా ఇలా సమకూర్చి మరో లక్ష పే చేశారు. కానీ.. ఆ తరువాత నాగప్రియ చనిపోయింది. మిగతా డబ్బు అంటూ ఆస్పత్రి వర్గాలు బెట్టు వీడలేదు. ఆ డబ్బులు చెల్లించాకనే శవాన్ని ఇస్తామని ఖరాఖండిగా చెప్పారు. అయితే.. తమ కూతురికి వైద్యం చేయడం ఆపేయడం వల్లనే చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Tagore repeat treatment of a dead body in hyderabad the story of a private hospital that stole lakhs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com