KTR is Missing The Logic: ‘రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉంటాం. వసూళ్ల కోసమే రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు’ అని నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దూరం అయితేనే తెలుస్తుందన్నట్లు.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమావేశంలో కేటీఆర్ ఇలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీఆర్ఎస్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నట్లు ఆయన మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. మార్పు కోసం అంటూ కాంగ్రెస్ ను గెలిపిస్తే ఎలాంటి మార్పులు వచ్చాయో చూస్తున్నారు కదా అని వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలతో ఆందోళనలు చేస్తున్న వారిలో మరో రకం చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఆందోళనలు జరిగాయి కదా.. మరి వాటి గురించి అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తున్న ఆందోళనలకు ఎక్కడి నుంచో వచ్చి ఎందుకు మద్దతు తెలుపుతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే.. గ్రౌండ్ లెవల్‌లో ఆ పరిస్థితి ఉన్నదా అన్నది ఎవరూ క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. నిన్న ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్కడికి వెళ్లిన కేటీఆర్‌ను ఆటోడ్రైవర్లు నిలదీశారు. పిలవకుండా ఎలా వచ్చారంటూ అవమానించారు. దాంతో కేటీఆర్ ఖంగుతిన్నారు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల నష్టపోతున్నామని ఆటోడ్రైవర్లు ఈ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అయినప్పటికీ వారికి మద్దతు తెలుపుతానంటూ కేటీఆర్ మరీ ఆటోలో వచ్చారు. కానీ.. కేటీఆర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. కేటీఆర్ కొన్ని దురుసు వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ ఇప్పుడున్న సందర్భాల్లో సమావేశాలకు పిలిచినా పిలవకపోయినా అన్నింటికీ హాజరవుతున్నారు. దాంతో నిన్న అనూహ్యంగా ఆటోడ్రైవర్ల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఆయన ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అయితే.. కేటీఆర్ హాజరైన ప్రతి సమావేశాల్లోనూ దురుసుగా మాట్లాడుతున్నారన్న టాక్ ఉంది. ఎదుట వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఎవరు ఆందోళనలు చేస్తున్నా వారి దగ్గరకు అవే మాటలు మాట్లాడుతున్నారని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మార్పు కోరుకొని ఇప్పుడు ఏం సాధించారని ఎక్కడికెళ్లినా ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఆందోళనలు గత ప్రభుత్వ హయాంలోనూ చేశారు. ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతీ ప్రభుత్వంలో కూడా ఏవో వర్గాలు రోడ్డెక్కుతూనే ఉంటాయి. అయితే.. అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పకనే తప్పదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసినప్పుడు కూడా అది ప్రభుత్వ వైఫల్యాలే కదా. దాంతో ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఇది కాస్త కేటీఆర్‌కు తెలియకుండా పోయింది. దానిని గుర్తించకుండా కేటీఆర్ మాత్రం ఎక్కడ పడితే అక్కడకు ఆందోళనలకు హాజరుకావడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. అటు పార్టీ కేడర్ కూడా కేటీఆర్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పిలవకుండా ఆందోళనలకు వెళ్లడంపైనా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని వినిపిస్తోంది. కేటీఆర్ వైఖరిని సైతం తప్పుపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Ktr is missing the logic here
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com