Homeఎంటర్టైన్మెంట్Trivikram pan India movie : ఇప్పుడు త్రివిక్రమ్ తో పాన్ ఇండియా సినిమాలు చేయడం...

Trivikram pan India movie : ఇప్పుడు త్రివిక్రమ్ తో పాన్ ఇండియా సినిమాలు చేయడం రిస్క్ ఏనా..?

Trivikram pan India movie : కెరీర్ మొదట్లోనే రైటర్ గా తన సత్తా చాటుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆ తర్వాత దర్శకుడిగా మారి భారీ విజయాలను సాధించాడు. ఇంతకు ముందు ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీదనే అందరి ఫోకస్ అయితే ఉంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే త్రివిక్రమ్ మరోసారి లైమ్ లైట్ […]

Trivikram pan India movie : కెరీర్ మొదట్లోనే రైటర్ గా తన సత్తా చాటుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆ తర్వాత దర్శకుడిగా మారి భారీ విజయాలను సాధించాడు. ఇంతకు ముందు ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీదనే అందరి ఫోకస్ అయితే ఉంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే త్రివిక్రమ్ మరోసారి లైమ్ లైట్ లోకి వస్తాడు. లేకపోతే మాత్రం తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంది… ఇప్పటివరకు త్రివిక్రమ్ కు ఉన్న బ్రాండ్ ను కాపాడుకోవాలంటే ఇప్పుడు వరుసగా సక్సెస్ లను సాధించాలి. ఇక ఈ క్రమంలోనే త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలు చేయడం వృధా అంటు కొంతమంది వాదిస్తుంటే త్రివిక్రమ్ ఫోకస్ పెట్టి మూవీ చేస్తే పాన్ ఇండియాలో కూడా భారీ సత్తాని చాటుకొని పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మారే అవకాశం కూడా ఉందని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడనేది వాస్తవం…

‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మెప్పిస్తే జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్టు మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడతాయి. లేకపోతే మాత్రం ప్రాజెక్ట్ కూడా మెటీరియలైజ్ అయ్యే అవకాశమైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు దర్శకులు అవుట్ స్టాండింగ్ మేకింగ్ వాల్యూస్ తో ప్రేక్షకులకు విజువల్ వండర్స్ ని క్రియేట్ చేసి పెడుతున్నారు.

కాబట్టి త్రివిక్రమ్ సైతం ఇప్పటికి అదే మూస ధోరణిలో వెళ్లకుండా మేకింగ్ విషయంలో కసరతులు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఒకటే దారిలో ముందుకు వెళ్తే మాత్రం ఆయన మరోసారి భారీ విమర్శలను ఎదురుకుంటాడు. ఆయన కెరియర్ కూడా చెడిపోయే ప్రమాదం ఉంది… కాబట్టి అతనితో పాన్ ఇండియా సినిమా చేయడం బెటర్ అని కొంతమంది అనుకుంటే మరి కొంత మంది మాత్రం ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాడు.

కాబట్టి అతనితో పాన్ ఇండియా ప్రాజెక్టు చేయాలి అలా అయితేనే అతను తన సత్తాను చూపించుకోగలుగుతారని వాదిస్తున్నారు… ఫైనల్ గా ఏమవుతుంది త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందా పాన్ ఇండియాలో తను కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు ను సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper