spot_img
Homeక్రైమ్‌Telangana crime news : నాన్నది సహజ మరణం కాదు.. అమ్మ, మరో వ్యక్తి కలిసి.....

Telangana crime news : నాన్నది సహజ మరణం కాదు.. అమ్మ, మరో వ్యక్తి కలిసి.. ఆ బాలిక చెప్పిన మాటలతో అంతా షాక్!

Telangana crime news :  అది తెలంగాణ రాష్ట్రం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం.. ఈ గ్రామానికి చెందిన జాఫర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన ఖతీజా ను వివాహం చేసుకున్నాడు. దాదాపు పది సంవత్సరాలు వీరిద్దరూ తిప్పనపల్లి లోనే ఉన్నారు. మూడు సంవత్సరాలుగా చింతలపూడిలో ఉంటున్నారు. జాఫర్, ఖతీజాపది సంవత్సరాల పాటు తిప్పనపల్లిలో ఉన్న వీరు.. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం చింతలపూడి వెళ్లారు. అక్కడే ఖతీజా, జాఫర్ నివాసం ఉంటున్నారు. ఖతీజా, జాఫర్ దంపతుల కుమారుడు హాస్టల్ ఉండి చదువుతున్నాడు. ఎనిమిది సంవత్సరాల కుమార్తె మాత్రం ఖతీజా, జాఫర్ తో ఉంటున్నది.

కొంతకాలం క్రితం ఖతీజాకు మీరా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం జాఫర్ కు తెలిసింది. ఆ తర్వాత ఖతీజాను నిలదీశాడు. ఇది సరైన పద్ధతి కాదని మందలించాడు. ఖతీజా తను చేస్తున్న పనిని సమర్థించుకుంది. అంతేకాదు, జాఫర్ నే ఉల్టా దూషించడం మొదలుపెట్టింది. భార్య తీరును జాఫర్ తట్టుకోలేకపోయాడు. భార్యతో కలిసి ఆరు నెలల క్రితం తిప్పనపల్లి వచ్చాడు. గ్రామం మారినప్పటికీ ఖతీజా తీరు మారలేదు. పైగా మీరాతో రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టింది. దీనిని గమనించిన జాఫర్ ఆమెను మందలించాడు. ఈ విషయాన్ని ఖతీజా ప్రియుడితో చెప్పింది. దీంతో వారిద్దరూ జాఫర్ ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో నిద్రపోతున్నజాఫర్ ముఖం మీద దిండు పెట్టారు. అతడికి ఊపిరి ఆడకుండా చేశారు. దీంతో జాఫర్ కన్నుమూశాడు.

తదుపరి రోజు జాఫర్ మద్యంతాగి కింది పడిపోయి చనిపోయాడని ఖతీజా నమ్మించింది. బంధువులు కూడా ఆమె ఫెర్మామెన్స్ చూసి నిజమని నమ్మారు. అనంతరం అతడికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత జాఫర్ కుమర్తెతో బంధువులు మాట్లాడుతుండగా హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ‘నాన్న ను అమ్మ, మరో వ్యక్తి కలిసి చంపారు. దిండు ముఖం మీద పెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. నాన్న మద్యం తాగి చనిపోలేదు. అతడిని చంపేస్తే చనిపోయాడని’ జాఫర్ కుమార్తె చెప్పింది. దీంతో జాఫర్ బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాదు ఖతీజా, ఆమె ప్రియుడిని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. జాఫర్ చనిపోవడం.. ఖతీజా జైలుకు వెళ్లడంతో ఆ ఇద్దరి పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular