spot_img
HomeతెలంగాణPOCSO cases in Telangana : తెలంగాణలో ఏమాత్రం రక్షణ లేదా.. దేశంలోనే నాలుగో స్థానమా.....

POCSO cases in Telangana : తెలంగాణలో ఏమాత్రం రక్షణ లేదా.. దేశంలోనే నాలుగో స్థానమా.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు

POCSO cases in Telangana : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఓ బాలిక మీద దారుణానికి పాల్పడ్డాడు. ఫలితంగా పోలీసులు అతని మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు. ఫోక్సో కేసు చాలా బలమైనది. అంత సులభంగా బెయిల్ దొరకదు. చివరికి బండి సంజయ్ కేంద్ర మంత్రి అయినప్పటికీ ఆయన కుమారుడిని కాపాడుకోలేకపోయాడు.

ఖమ్మం నగరానికి చెందిన గౌస్ భారత రాష్ట్ర సమితి నాయకుడు. ఇతడి మీద ఖమ్మం రెండవ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ అయి ఉంది. అనేక కేసులలో ఇతడు నిందితుడు. అయినప్పటికీ గులాబీ పార్టీ పెద్దలు ఇతడిని తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇతడు ఎన్నో రకాల దారుణాలకు పాల్పడ్డాడు. అధికారంలో ఉన్నప్పుడు సామాన్యులకు చుక్కలు చూపించాడు. తాను నివాసముండే ప్రాంతానికి దగ్గరలో ఉండే అపార్ట్మెంట్లో పనిచేసే ఓ బాలిక మీద కన్నేశాడు. ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో అపార్ట్మెంట్ పైనుంచి కింద పడేశాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ వ్యవహారం తెలిసిన తర్వాత పోలీసులు గౌస్ మీద ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారు.

ఈ రెండు ఘటనలు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ రెండు కూడా ఫోక్సో యాక్ట్ కింద నమోదైన కేసులు. కేవలం ఇవి రెండు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 5 ఫోక్సో కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు రెండవ స్థానంలో, అస్సాం మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగు స్థానంలో తెలంగాణ కొనసాగుతోంది. 2025లో తెలంగాణ రాష్ట్రంలో 568 ఫోక్సో కేసులు నమోదయ్యాయి. 2024తో పోల్చి చూస్తే 2025 లో ఏకంగా 27% అధికంగా ఫోక్సో కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఫోక్సో కేసుల రికార్డెడ్ శాతం 9 గా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో అది 19 శాతం గా ఉంది. దేశంలో ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లోనే ఫోక్సో కేసులు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

కొన్ని కేసులు పోలీస్ స్టేషన్ దగ్గర దాకా రావడం లేదు. సెటిల్మెంట్లే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అంతర్గతంగా పోలీసులు అంగీకరిస్తున్నారు. బాలికల మీద పరస్పర సమ్మతితో చేసినప్పటికీ నేరం నేరమే. పైగా ఫోక్సో చట్టం అత్యంత కఠినంగా ఉంటుంది. ఫలితంగా నమోదయ్యే కేసుల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. సాధ్యమైనంతవరకు పురుషులు బాలికల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ కేసులో బెయిల్ కూడా లభించదు. ఒకరకంగా చెప్పాలంటే ఒక ఉగ్రవాదిని ఏ విధంగానైతే ట్రీట్ చేస్తారో.. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని పోలీసులు అలా ట్రీట్ చేస్తుంటారు.. నేటి టీనేజ్ పిల్లలు కలిగే ఆకర్షణను ప్రేమ అనుకుంటున్నారు. అదే క్రమంలో దారి తప్పుతున్నారు. చివరికి ఫోక్సో కేసులలో ఇరుక్కుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతి ఏడాది కేసుల తీవ్రత పెరిగిపోవడం పోలీస్ శాఖను సైతం నివ్వెర పరుస్తోంది. అందువల్లే పోలీసులు యువకులకు అవగాహన కలిగిస్తున్నారు. బాలికల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటించాలని.. జీవితంలో స్థిరత్వం సాధించిన తర్వాత ప్రేమ లేదా పెళ్లి వ్యవహారాల జోలికి వెళ్లాలని చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper