Buchi Babu Sana next movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇప్పటికే వాళ్ళందరు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఆయా దర్శకుల మధ్య ఉంది. ఇక ఇలాంటి దర్శకులు ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పించబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇలాంటి క్రమంలోనే బుచ్చి బాబు లాంటి దర్శకుడు సైతం ఇప్పటికి రెండు సినిమాల్లో చేసి రెండింటితో మంచి విజయాలను సాధించాడు. ‘ఉప్పెన’ సినిమాతో భారీ క్రేజ్ ను మూటగట్టుకున్న ఆయన రామ్ చరణ్ తో చేసిన పెద్ది సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కొన్ని ఏరియాలో డివైడ్ టాక్స్ తెచ్చుకున్నప్పటికీ మరికొన్ని ఏరియాలో మాత్రమే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తో ఒక డిఫరెంట్ ప్రయత్నం చేసిన ఘనత కూడా బుచ్చిబాబుకే దక్కుతుంది… బుచ్చిబాబు సినిమా అంటే హీరో ఏదో ఒక అంగవైకల్యాన్ని కలిగి ఉంటాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఉప్పెన సినిమాలో హీరో ప్రైవేట్ పార్ట్స్ కోసేస్తాడు. పెద్ది సినిమాలో సైతం అతని కాలును కోల్పోవడం అనేది నిజంగా ప్రేక్షకులను ఎమోషనల్ కి గురి చేసే సన్నివేశాలనే చెప్పాలి. ఇక తన తదుపరి సినిమాలో కూడా హీరోకి ఒక చెయ్యి కే అయిపోతుందట. ఇప్పటికే ఆయన కథను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. తొందర్లోనే ఈ సినిమాని ఒక స్టార్ హీరోకి చెప్పబోతున్నారట.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు ఈ కథను తమిళ హీరో అయిన సూర్య తో చేయాలనే సన్నాహాలు చేస్తున్నాడట. నిజానికి బుచ్చిబాబు కథలో రిక్వైర్ ఉండి హీరోలకు ఏదో ఒక అంగవైకల్యం పెడుతున్నాడా? లేదంటే అంగవైకల్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన కథను రాసుకుంటున్నాడా లేదా అనే ధోరణిలో కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో బుచ్చిబాబు చేసే సినిమాలకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక వాళ్ళందరిని మెప్పించే విధంగా ఈ సినిమాలు ఉండబోతున్నాయా? తదుపరి సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు? తద్వారా మరోసారి తన పేరు మారుమ్రోగిపోయేలా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

