srh vs lsg match report : ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో అప్పర్ హ్యాండ్ కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు.. హైదరాబాద్ జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించింది. హైదరాబాద్ మాజీ ఆటగాడు షమి అభిషేక్ శర్మ.. హెడ్ వికెట్లు పడగొట్టి.. సన్ రైజర్స్ కు షాక్ ఇచ్చాడు..
ఈ దశలో హైదరాబాద్ జట్టును కాపాడేందుకు నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ రంగంలోకి దిగారు. సెంచరీ భాగస్వామ్యంతో హైదరాబాద్ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు మళ్లీ ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత వికెట్లు వెంట వెంటనే కోల్పోయి 156 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. దీనిని చేదించడానికి లక్నో జట్టు పెద్దగా ఇబ్బంది పడిన దాఖలాలు కల్పించడం లేదు.
లక్నో జట్టులో హైదరాబాద్ జట్టుకు ఒకప్పుడు ఆడిన ఆటగాళ్లు ఉండడంతో.. చేదన అనేది ఆ జట్టుకు పెద్దగా ఇబ్బంది కావడం లేదు. మార్ష్ 14 పరుగులు చేశాడు. ఇతడు ఒకప్పుడు హైదరాబాద్ జట్టులో ఆడాడు.. అబ్దుల్ సమద్, షాబాజ్, షమీ, పూరన్ కూడా ఒకప్పటి హైదరాబాద్ జట్టు ప్లేయర్లే. స్ట్రాటజిక్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, హెడ్ కోచ్ కూడా ఒకప్పుడు హైదరాబాద్ జట్టుకు పనిచేసిన వారే. వీరందరినీ రంగంలోకి దించిన లక్నో యాజమాన్యం.. హైదరాబాద్ జట్టుపై గట్టి రివెంజ్ కు ప్లాన్ చేసింది.
వాస్తవానికి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం హైదరాబాద్ జట్టులో ఒకప్పుడు ఆడిన షమీనే. ఎందుకంటే ఈ మైదానం మీద అతడికి పూర్తిస్థాయిలో పట్టు ఉంది. ఈ మైదానంలో అంతగా గ్రాసు లేకపోవడంతో బంతి మీద పట్టు లభిస్తుందని అతడు అంచనా వేశాడు. అందువల్లే రిషబ్ పంత్ తో టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోమని చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే టాస్ గెలవగానే పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
తొలి ఓవర్ లోనే హైదరాబాద్ జట్టుకు షాక్ ఇచ్చాడు షమీ. ఆ తర్వాత ఓవర్లలో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు వరుసగా అవుట్ కావడంతో.. లక్నో జట్టుకు అప్పర్ హ్యాండ్ కొనసాగించే అవకాశం లభించింది.. అయితే నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో హైదరాబాద్ జట్టు కాస్త గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ స్కోర్ ను కాపాడుకోవడంలో హైదరాబాద్ జట్టు బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు . హర్ష్ దూబే మినహా మిగతా బౌలర్లు(నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్) విఫలమయ్యారు. బంతిమీద పట్టు సాధించి వేయడంలో ఫ్లాప్ అయ్యారు.